White Hair Problem: జుట్టు ఎందుకు తెల్లబడుతుంది, మీ డైట్‌లో ఈ విటమిన్ ఉంటే వైట్ హెయిర్ సమస్యకు చెక్

White Hair Problem Solution in Telugu: ఇటీవలి కాలంలో ఆధునిక జీవనశైలి కారణంగా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటి వైట్ హెయిర్. ఇప్పుడు యుక్త వయస్సులోవారికి కూడా ఈ సమస్య ఎదురౌతోంది. ఫలితంగా నలుగురిలో అసౌకర్యానికి గురవుతున్నారు. అంతేకాదు..వయసు పైబడినట్టు కన్పిస్తున్నారు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఈ టిప్స్ పాటించాల్సిందే.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 30, 2024, 02:05 PM IST
White Hair Problem: జుట్టు ఎందుకు తెల్లబడుతుంది, మీ డైట్‌లో ఈ విటమిన్ ఉంటే వైట్ హెయిర్ సమస్యకు చెక్

White Hair Problem Solution in Telugu: వాతావరణంలో కాలుష్యం, ఆధునిక జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా తక్కువ వయస్సుకే జుట్టు తెల్లబడిపోతోంది. గత కొద్దికాంలో 30 ఏళ్ల వయస్సుకే ఈ సమస్య వచ్చి పడుతోంది. తెల్ల జుట్టుకు జీన్స్ కూడా ఓ కారణంగా తెలుస్తోంది. సకాలంలో ఈ సమస్యను గుర్తించగలిగితే కొన్ని చిట్కాల ద్వారా బయటపడవచ్చు. జుట్టు తెల్లబడకుండా కాపాడుకోవచ్చు.

జుట్టు తెల్లడటానికి చాలా కారణాలుంటాయి. సరైన పోషకాలు కేశాలకు అందకపోవడం ఇందులో ముఖ్యమైంది. పిన్న వయస్సుకే జుట్టు తెల్లబడితే ఆందోళన చెందుకుండా కారణం ఏంటనేది తెలుసుకోవాలి. అవసరమైతే పరీక్షద్వారా శరీరంలో ఏయే పోషకాల లోపం ఉందో నిర్ధారించుకోవాలి. ఎందుకంటే ఆధునిక జీవనశైలిలో హెల్తీ డైట్ అనేది లోపిస్తోంది. దాంతో శరీరానికి కావల్సిన పోషకాలు అన్నీ అందక తక్కువ వయస్సులోనే జుట్టు తెల్లబడిపోతోంది. శరీరంలో కావల్సిన పోషకాల్లో ముఖ్యమైంది కోబాలమిన్. చాలామందికి తెలియని విషయమేంటంటే కోబాలమిన్ లోపమే జుట్టు తెల్లబడటానికి ప్రధాన కారణమని. అంటే విటమిన్ బి 12 . అందుకే మనం తినే ఆహారంలో విటమిన్ బి12 సహా కీలకమైన పోషకాలు ఉండేట్టు చూసుకోవాలి. లేకపోతే జుట్టు రాలడం, విరగడం, తెల్లబడటం వంటి సమస్యలు కన్పిస్తాయి.

జుట్టు తెల్లబడకుండా నియంత్రించాలంటే ముందుగా చేయాల్సింది జీవనశైలిలో మార్పు. తక్కువ వయస్సుకే జుట్టు నెరవకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ తప్పకుండా పాటించాలి. ముఖ్యంగా టెన్షన్ తగ్గించుకోవాలి. హెల్తీ డైట్ తినాలి. ఆయిలీ పుడ్స్ దూరం చేయాలి. సిగరెట్, మద్యం రెండింటినీ వదిలేయాలి. రోజూ షాంపూతో స్నానం తప్పకుండా చేయాలి. తలకు కొబ్బరి నూనె లేదా ఆవాల నూనె రాస్తుండాలి. 

ఇవి పాటిస్తూనే కోబాలమిన్  అధికంగా ఉండే గుడ్లు, సోయాబీన్స్, పెరుగు, ఓట్స్, పాలు, పన్నీరు, బ్రోకలీ, చేపలు, చికెన్, మష్రూం, రెడ్ మీట్ తప్పకుండా తినాలి. ఇవి క్రమం తప్పకుండా పాటిస్తే కచ్చితంగా జుట్టు నెరవకుండా కాపాడుకోవచ్చు. వైట్ హెయిర్ సమస్యతో పాటు హెయిర్ ఫాల్ సమస్యకు కూడా చెక్ చెప్పవచ్చు.

Also read: Amazon Discount Sales: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, 108 MP కెమేరా ఫోన్ కేవలం 15వేలకే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News