Amazon Discount Sales: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, 108 MP కెమేరా ఫోన్ కేవలం 15వేలకే

Amazon Discount Sales: దసరా, దీపావళి సీజన్ వేళ ప్రముఖ ఈ కామర్స్ వేదికలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌‌లో ప్రత్యేక డిస్కౌంట్ సేల్స్ అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సందడి చేస్తున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 30, 2024, 10:59 AM IST
Amazon Discount Sales: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, 108 MP కెమేరా ఫోన్ కేవలం 15వేలకే

Amazon Discount Sales: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సెప్టెంబర్ 27 నుంచి అందుబాటులో వచ్చింది. ఈ సందర్భంగా వివిధ రకాల ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌టీవీలు, స్మార్ట్‌వాచ్‌లతో పాటు ఇతర వస్తువులపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు నడుస్తున్నాయి. ఈ ఆఫర్ల వివరాలు తెలుసుకుందాం.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024లో ఎంట్రీ లెవెల్, మిడ్ రేంజ్ ఫోన్లపై ఊహించని డిస్కౌంట్ లభిస్తోంది. ఇటీవలే మార్కెట్‌లో లాంచ్ అయినా Honor 200 Lite 5G కూడా భారీ డిస్కౌంట్ ధరకు లభిస్తోంది. ఇందులో 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫోన్ ఇప్పుడు కేవంల 15,998 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు. Honor 200 Lite 5G ఫోన్ 6.7 ఇంచెస్ పుల్ హెచ్‌డి ప్లస్ ఎమోల్డ్ డిస్‌ప్లేతో 1080/2412 రిజల్యూషన్ కలిగి ఉంటుంది. ఇందులో 2000 నిట్స్ బ్రైట్‌నెస్ ఉండటం వల్ల అద్భుతమైన క్లారిటీ ఉంటుంది. అంతేకాకుండా 93.7 శాతం స్క్రీన్ టు బాడీ యాస్పెక్ట్ రేషియో ఉంటుంది. 

ఈ ఫోన్ ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్‌సెట్ ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వెర్షన్ ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేస్తుంది. ఇక అన్నింటికంటే కెమేరా ఇందులో ప్రధాన ఆకర్ణణ. ఇందులో ట్రిపుల్ కెమేరా యాక్సెస్ ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా, 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమేరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమేరా, 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమేరా ఉంటాయి. 

హానర్ 200 లైట్ 5జి ఫోన్‌లో 35 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయడమే కాకుండా 4500 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంటుంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. 

Also read: Gold Rate Today: పసిడి ప్రియులకు శుభవార్త..దిగివస్తున్న బంగారం ధరలు..నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News