Investment Plan: కోటీశ్వరులు కావాలంటే.. నెలకు రూ. 10వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు..రూ. 6 కోట్లు మీ జేబులోకి..ఎలాగో తెలుసా?

Mutual Fund: మ్యూచువల్ ఫండ్ SIP సహాయంతో నెలకు రూ. 10వేలు ఇన్వెస్ట్ చాలు . రూ.6కోట్లు మీ చేతిలోకి వస్తాయి. దీని కోసం మీరు స్టెప్-అప్ ఫార్ములాను ఫాలో అవ్వాలి. పూర్తి వివరాలు తెలుసుకుందాం. 

1 /7

SIP: స్టాక్ మార్కెట్లో నేరుగా పెట్టుబడి పెట్టడం అంటే చాలా రిస్క్ తో కూడిన పని. అందుకోసమే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి.  మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం కోసం మీరు రెండు పద్ధతులు ఉంటాయి. ఒకటి లంప్సం పద్ధతిలో పెట్టుబడి పెట్టడం, రెండోది ప్రతి నెల వాయిదాల పద్ధతిలో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ప్రకారం లేదా సిప్ పద్ధతిలో పెట్టుబడి పెట్టవచ్చు.   

2 /7

ఇలా పెట్టుబడి పెట్టడం వల్ల మీ పిల్లలు లేదా మీ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ప్లాన్ చేసుకున్నట్లయితే మీకు కావాల్సిన డబ్బు పెద్ద మొత్తంలో లభిస్తుంది.  ప్రస్తుతం ప్రతి నెల  రూ.10,000 SIP చేయడం ద్వారా రూ.6 కోట్ల డబ్బును కూడా పెట్టాలంటే ఎంత సమయం పడుతుంది. ఎంత పెట్టుబడి పెట్టాలో తెలుసుకుందాం.    

3 /7

మ్యూచువల్ ఫండ్ SIP సహాయంతో, నెలవారీ రూ.10,000 పెట్టుబడితో రూ.6 కోట్ల కార్పస్‌ ఫండ్ సృష్టించవచ్చు. అయితే, దీని కోసం మీరు స్టెప్-అప్ ఫార్ములాను ఉపయోగించాలి. మీరు రూ.10,000తో SIPని ప్రారంభించి, మీ SIPని ప్రతి సంవత్సరం 9 శాతం పెంచుకుంటే, మీరు మీ లక్ష్యాన్ని చేరుకోవచ్చు.  

4 /7

మీరు రూ.10,000తో మీ SIPని ప్రారంభించి, ప్రతి సంవత్సరం 9 శాతం స్టెప్-అప్ చేసి, సంవత్సరానికి సగటున 12 శాతం రాబడిని పొందినట్లయితే, మీరు 28 సంవత్సరాలలో మీ లక్ష్యాన్ని చేరుకోవచ్చు. ఈ పెట్టుబడి వ్యూహంతో, 8 సంవత్సరాలలో మీ మొత్తం పెట్టుబడి రూ.1,35,56,186 అవుతుంది.   

5 /7

మీరు ఈ పెట్టుబడిపై దాదాపు రూ.4,60,83,511 రాబడిని పొందే వీలుంది. ఇప్పుడు ఈ రెండు మొత్తాలను కలిపితే, మీ మొత్తం కార్పస్ రూ. 5.96 కోట్లు అవుతుంది. అంటే సుమారు 6 కోట్ల రూపాయలు లభిస్తాయి. అయితే ఇక్కడ మేము పేర్కొన్న 12 శాతం రాబడి ఒక అంచనా మాత్రమే. ఇందులో హెచ్చుతగ్గులు ఉంటాయి.   

6 /7

మీరు సంవత్సరానికి 15 శాతం రాబడిని అంచనా వేస్తే, మీరు 25 సంవత్సరాలలో రూ.6.05 కోట్ల ఫండ్‌ను సృష్టించవచ్చు. ప్రతి సంవత్సరం 9 శాతం స్టెప్-అప్‌తో రూ.10,000 నుండి SIP ప్రారంభించి.. 25 సంవత్సరాలలో మీ మొత్తం పెట్టుబడి రూ.1.02 కోట్లు అవుతుంది.   

7 /7

మీరు ఈ పెట్టుబడిపై దాదాపు రూ. 5.04 కోట్ల రాబడిని పొందుతారు. ఈ రెండు మొత్తాలను కలపడం ద్వారా మీ మొత్తం కార్పస్ రూ.6.05 కోట్లు అవుతుంది.