Yati narsinghanand: యతి నర్సింహానంద్ ఎవరు..?.. 50కి పైగా కేసుల నమోదు.. ఆయన ఏమన్నారంటే.. సంచలనంగా మారిన వీడియో..

Yati narsinghanand controversy: హరిద్వార్ కు చెందిన ఒక ఆలయ పూజారీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశంలో సంచలనంగా మారాయి. ఏకంగా దేశ వ్యాప్తంగా ఆయనపై పలు పోలీస్ స్టేషన్ లలో యాభైకి పైగా కేసులు నమోదయ్యాయి.

Written by - Inamdar Paresh | Last Updated : Oct 5, 2024, 04:47 PM IST
  • మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేసిన నర్సింగహానందా..
  • చర్యలు తీసుకొవాలని నిరసనలు..
Yati narsinghanand: యతి నర్సింహానంద్ ఎవరు..?.. 50కి పైగా కేసుల నమోదు.. ఆయన ఏమన్నారంటే.. సంచలనంగా మారిన వీడియో..

yati narsinghanand saraswati controversy video: ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఒక ఆలయ పూజారీ చేసిన వ్యాఖ్యలు దేశంలో తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఆయనపై ఏకంగా దేశ వ్యాప్తంగా యాభైకి పైగా కేసులు సైతం నమోదయ్యాయి. ఈ క్రమంలో ముస్లింలంతా ఆయనపై వెంటనే చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయన ఇటీవల ఘజియాబాద్‌లోని లోహియా నగర్‌లోని హిందీ భవన్‌లో సెప్టెంబర్ 29న జరిగిన బహిరంగ కార్యక్రమంలో యతి నర్సింహానంద్ సరస్వతి పాల్గొన్నారు. అక్కడ మాట్లాడుతూ.. ప్రతి ఏటా దసరా రోజున రావణుడ్ని దహానం చేయడం చేస్తుంటారు. 

 

అయితే రావణుడ్ని కాదని, ఇక మీదట మొహమ్మద్ దిష్టిబొమ్మను కాల్చండంటూ కూడా వ్యాఖ్యలు చేశారు.దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. దీనిపై దేశ వ్యాప్తంగా ఉన్న ముస్లింగ్ సంఘాలన్ని భగ్గుమన్నాయి. ప్రస్తుతం దేశంలో భిన్నత్వంలో ఏకత్వంలా.. హిందు, ముస్లింలు కలిసి ఉంటున్నారని అలాంటి సమయంలో.. ఈ వ్యాఖ్యలు వారి మధ్యలో గొడవలకు కారణమౌతాయని కూడా కొంత మంది ముస్లింలు దీనిపై ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా.. ఈ వివాదస్పద వ్యాఖ్యల తర్వాత.. దేశవ్యాప్తంగా ముస్లింలు 50కి పైగా పోలీస్ స్టేషన్ లలో కేసులను నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. గతంలో కూడా ఆయన పలు సందర్భాలలో ఇస్లాంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తలలో నిలిచారు. 2022లో మహిళలపై కించపరిచే వ్యాఖ్యలు చేశారంటూ ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో నర్సింగానంద్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 

మ‌ద‌ర్సాలాల కూల్చివేత‌, అలీఘ‌ఢ్ ముస్లిం యూనివ‌ర్సిటీని గ‌న్‌పౌడ‌ర్ ఉప‌యోగించి పేల్చివేయాల‌ని పిలుపు ఇచ్చిన వివాదాస్ప‌ద స్వామీజీ య‌తి న‌ర్సింహానంద్ స‌ర‌స్వ‌తిపై కేసు న‌మోదైంది. అదే విధంగా దేశంలో హిందువులు ఎక్కువ మందిని పిల్లల్ని కనకుంటే.. వారిమనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని కూడా.. నర్సింగానంద్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

Read more: Udhayanidhi Stalin: పవన్ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎం స్ట్రాంగ్ వార్నింగ్‌.. 'వెయిట్‌ అండ్‌ సీ' అని హెచ్చరిక

ఈ క్రమంలో ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలపై మాత్రం.. తీవ్ర దుమారం చెలరేగిందని చెప్పుకొవచ్చు.  దీనిపై హైదరబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సీరియస్ గా స్పందించారు. అంతేకాకుండా హైదరాబాద్ లో కూడా దీనిపై నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో డీజీపీ, సీపీలను కలిసి వినతీపత్రంకూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News