Molaka Pesarattu Recipe: మన తరుచు బ్రేక్ ఫాస్ట్‌లోకి దోశలను తయారు చేస్తాము. అయితే బరువు తగ్గించడానికి పెసల దోశ ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. మొకలు తినడానికి ఇష్టపడనివారు ఇలా దోశలను తయారు చేసుకొని తింటే మంచి ఫలితాలు కలుగుతాయి. ఇందులో ఉండే ప్రోటీన్, విటమిన్, ఇతర పోషకాలు శరీరానికి సహాయపడుతాయి. ఈ దోశలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థకు ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే బరువును తగ్గించడంలో కీలక ప్రాత పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు బ్రేక్‌ఫాస్ట్‌లో ఒకటి తినడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.
కావలసిన పదార్థాలు:
పెసలు: 1 కప్పు
బియ్యం: 50 గ్రాములు (1 గంట నీళ్లలో నానపెట్టినది)
పచ్చిమిరపకాయలు: 4 (తరిగినవి)
తరిగిన అల్లం
ఉప్పు: 1 టీస్పూన్
జీలకర్ర: 1 టీస్పూన్
పసుపు: 1/2 టీస్పూన్
ఇంగువ: 1/2 టీస్పూన్
నీళ్లు
నెయ్యి
తయారీ విధానం:
ముందుగా పెసలను 12 గంటల పాటు నీళ్లలో నానబెట్టి, నీళ్ళు వంపేయాలి.ఆ తరువాత నానబెట్టిన పెసలను ఒక గుడ్డలో వేసి గట్టిగా కట్టేసి 12 గంటల పాటు పక్కన పెడితే మొలకలొస్తాయి. వీటిని బియ్యాన్ని నీళ్లతో పాటు వేసి, పచ్చిమిరపకాయలు, అల్లం, జీలకర్ర, పసుపు, ఇంగువ, ఉప్పు కూడా వేసి, కొన్ని మొలకెత్తిన పెసలని కూడా వేయాలి. ఒక్కసారి రుబ్బిన తరువాత మిగిలిన పెసలని కూడా వేసి, మెత్తగా అయ్యేట్టు రుబ్బాలి. ఈ పిండిని ఒక బౌల్లో వేసి, రుచి చూసి ఉప్పు వేయాలి, అలాగే కాస్త పలచగా తయారుచేయడానికి నీళ్ళు కూడా కలపాలి.
పెనాన్ని వేడి చేసి, తయారుచేసిన పిండిని ఒక గరిటెతో అట్టులా వేసి శుభ్రంగా తిప్పిన తరువాత, అంచుల్లో నెయ్యి వేసి కాల్చాలి. పెసరట్టుని రెండు వైపులా బ్రౌన్ రంగులోకి మారేంత వరకూ కాల్చిన తరువాత వేడివేడిగా కొబ్బరి చట్నీ, లేదా అల్లం చట్నీతో సర్వ్ చేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది.
చిట్కాలు:
మొలకలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి.
పిండిని ఎక్కువగా రుబ్బకుండా, కొద్దిగా గరుకుగా ఉండేలా చూసుకోవాలి.
పెసరట్టును కాల్చేటప్పుడు మంటను తక్కువగా ఉంచాలి.
పెసరట్టుతో పాటు వేడి వేడిగా తయారు చేసిన అల్లం చట్నీ లేదా కొబ్బరి చట్నీ తింటే రుచి ఎంతో బాగుంటుంది.
ఈ దోశను ఆహారంలో భాగంగా తీసుకోవడం చాలా మంచిది. సాధారణ దోశల కంటే ఇలా తయారు చేసుకొని తింటే ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.