EPFO: EPS - 95 స్కీం పెన్షనర్లకు ఇదొక శుభవార్త అని చెప్పవచ్చు. దేశవ్యాప్తంగా సుమారు 97,640 మంది EPF సభ్యులు, పెన్షనర్లు గత కొన్ని దశాబ్దాలుగా ఈపీఎస్- 1995 స్కీమం కింద అధిక వేతనంపై పెన్షన్ (PoWH) కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈపీఎస్ పెన్షనర్లకు ఊరట లభించింది. ఇప్పటికే హయ్యర్ పెన్షన్ కోసం డిమాండ్ నోటీసులు అందుకున్న వారిలో 89,235 మందికి పెన్షన్ ఆర్డర్‌లు (PPO) జారీ అయ్యాయి. సుప్రీంకోర్టు నవంబర్ 2022 తీర్పు ప్రకారం, హయ్యర్ పెన్షన్‌కు అర్హులుగా ప్రకటించిన సభ్యులు మాత్రమే డిమాండ్ నోటీసులను స్వీకరిస్తున్నారు.
ఒక ఉద్యోగి హయ్యర్ పెన్షన్ ఎంపికను ఎంచుకున్నప్పుడు, అతను పెన్షన్ ప్లాన్‌కు కంపెనీ తరపున మరింత ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఇవ్వడానికి ఎంచుకుంటాడు. సెప్టెంబర్ 1, 2014 నాటికి EPF చందాదారులుగా ఉన్న ఉద్యోగులు హయ్యర్ పెన్షన్ ఎంపికను ఎంచుకోవచ్చు. అదనపు మొత్తం ప్రత్యేక పెన్షన్ ఫండ్‌లో ఉంచుతారు. ఇది క్రమంగా వడ్డీని పొందుతుంది. ఇది మొత్తం పెన్షన్ మొత్తాన్ని పెంచుతుంది.
EPS హయ్యర్ పెన్షన్ దరఖాస్తుల స్థితిని ఎలా ట్రాక్ చేయాలి?
EPFO పోర్టల్‌లో హయ్యర్ EPS పెన్షన్ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత, మీకు రసీదు లభిస్తుంది. మీరు ఫారమ్‌ను సమర్పించిన తర్వాత, మీ దరఖాస్తును ట్రాక్ చేయడానికి EPFO మీకు URLని అందిస్తుంది. ఈ విధంగా అధిక ఆదాయం కోసం పెన్షన్ క్లెయిమ్‌ల స్థితిని తెలుసుకోవచ్చు.
స్టెప్ 1: https://unifiedportal-mem.epfindia.gov.in/memberInterfacePohw/ కి వెళ్లండి
స్టెప్ 2: 'ట్రాక్ EPS సీనియర్ పెన్షన్ అప్లికేషన్స్ స్టేటస్'పై క్లిక్ చేయండి
స్టెప్ 3: తదుపరి పేజీలో, కింది వివరాలను నమోదు చేయండి
- రసీదు సంఖ్య
- UAN
- PPO నంబర్
- CAPTCHA కోడ్
స్టెప్ 4: ఆధార్ నంబర్, బయోమెట్రిక్ ఆధార్ ఆధారిత ఆథంటికేషన్ కోసం చెక్‌బాక్స్‌ని క్లిక్ చేయండి.
స్టెప్ 5: ఆ తర్వాత 'గెట్ OTP'పై క్లిక్ చేయండి.
ఈపీఎస్ 95 పెన్షన్ స్కీం ద్వారా కనీస పెన్షన్ 7500 ఉండేలా డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తోంది. దీనికి తగ్గట్టుగా ఇప్పటికే సుప్రీంకోర్టు నుంచి కూడా ఆదేశాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అతి త్వరలోనే కేంద్ర ప్రభుత్వం హయ్యర్ పెన్షన్ విషయంలో అమలు విధానం ప్రారంభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈపీఎస్ 95 కింద పెన్షన్ దారులకు కేవలం 2000 రూపాయలు మాత్రమే పెన్షన్ లభిస్తుంది. పలు రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వృద్ధాప్య పెన్షన్ కన్నా కూడా ఇది చాలా తక్కువ మొత్తం అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో చాలా సంవత్సరాలుగా ఈపీఎస్ 95 పెన్షనర్లు తమ హయ్యర్ పెన్షన్ డిమాండ్ విషయంలో ఆందోళన బాట పడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.