Pawan Kalyan Tour: హస్తినలో జనసేనాని పవన్ కళ్యాణ్.. పూర్తి షెడ్యూల్ ఇదే..

Pawan Kalyan Tour: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ రోజు ఢిల్లీకి వెళ్లనున్నారు. అంతేకాదు ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవనున్నారు. దీంతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Nov 6, 2024, 09:35 AM IST
Pawan Kalyan Tour: హస్తినలో జనసేనాని పవన్ కళ్యాణ్.. పూర్తి షెడ్యూల్ ఇదే..

Pawan Kalyan Tour: ఏపీ డిప్యూటీ సీఎం తన ప్రభుత్వ భాగస్వామిగా ఉన్న హోం మంత్రి అనితపై చేసిన వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి. ముఖ్యంగా శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని తప్పుపట్టారు. అవసరమైతే.. హోం మంత్రిత్వ శాఖను తానే తీసుకొని .. యోగిలా పనిచేస్తానని అల్టీమేటం జారీ చేసారు. ప్రభుత్వంలోని హోం మినిష్టర్ పనితీరు బాగాలేదని చెప్పడం అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాంతి భద్రతల విషయంలో పూర్తిగా వైఫల్యం చెందారని ఇండైరెక్ట్ గా చెప్పినట్టు అయింది. మొత్తంగా ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు తీరి నాలుగు నెలల్లోనే లుకలుకలు బయలు దేరాయి. అంతేకాదు పలు జిల్లాల్లో తెలుగు దేశం, జనసేన కార్యకర్తలు నువ్వెంత అంటే నువ్వేంత అనే రేంజ్ లో బాహాబాహీకి దిగుతున్నారు.

ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ .. హస్తిన పర్యటకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలతో పాటు పలు కార్పోరేషన్ చైర్మన్ పదవుల పంపకంతో పాటు రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతల సమస్యలపై హోం మంత్రితో చర్చించున్నారు. అంతేకాదు రాష్ట్రంలో పరిపాలన ఎలా సాగుతుందనే దానిపై కూడా ఓ నివేదిక ఇవ్వనున్నట్టు సమాచారం. మరోవైపు ఏపీలో జనసేన, టీడీపీ, బీజేపీ శ్రేణుల మధ్య సమన్వయం కోసం కమలం పార్టీ పెద్దలతో చర్చించబోతున్నట్టు సమాచారం.

వెలగపూడిలో మంత్రి వర్గ సమావేశం అనంతరం పవన్‌ కల్యాణ్‌ ఢిల్లీ బయల్దేరుతారు. ఇటీవల పవన్​ పోలీసుల తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేయడం, అదేసమయంలో ఢిల్లీకి వెళ్లడం రాజకీయంగా కాక రేపుతోంది.  మరోవైపు మాజీ సీఎం జగన్​ మోహన్‌ రెడ్డికి చెందిన సరస్వతి పవర్​ ప్రాజెక్ట్​ భూములను నిన్న పవన్​ కల్యాణ్​ పరిశీలించారు. ఈ నేపథ్యంలో పవన్‌ ఢిల్లీ కి వెళ్ళడం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ కావడం రాజకీయ  ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీ పర్యటన తర్వాత రాత్రి ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గన్నవరం చేరుకుంటారు. ఆ తర్వాత మంగళగిరిలోని తన  క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు.

ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..

ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x