PM Internship Scheme: టాప్ 500 కంపెనీల్లో ఇంటర్న్‌షిప్‌.. నెలకు రూ. 5000 కోటీమంది పొందే అవకాశం, ఈ లింక్‌తో వెంటనే అప్లై చేసుకోండి..

PM Internship Scheme Portal Open Apply: కేంద్రం మరో బంపర్‌ ఆఫర్ ప్రకటించింది. యువత విద్య ఉపాధికి అంతరాన్ని తగ్గించడానికి ఈ అద్భుతమైన అవకాశాన్ని యువతకు అందిస్తోంది. ఈ పథకంలో యువత టాప్‌ 500 కంపెనీల్లో ఏడాదిపాటు ఇంటర్న్‌షిప్‌ చేసే అవకాశం లభిస్తుంది. అంతేకాదు ఏడాదిపాటు ప్రతినెలా రూ.5,000 ఇంటర్న్‌కు లభిస్తుంది. మీరు కూడా వెంటనే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోండి.  ఆ వివరాలు తెలుసుకుందాం.

Written by - Renuka Godugu | Last Updated : Oct 13, 2024, 10:39 AM IST
PM Internship Scheme: టాప్ 500 కంపెనీల్లో ఇంటర్న్‌షిప్‌.. నెలకు రూ. 5000 కోటీమంది పొందే అవకాశం, ఈ లింక్‌తో వెంటనే అప్లై చేసుకోండి..

PM Internship Scheme Portal Open Apply: ప్రధానమంత్రి ప్రారంభించిన ఈ పథకం ద్వారా దాదాపు కోటీమంది లబ్ధి పొందుతారు. టాప్‌ 500 కంపెనీల్లో యువతకు ఇంటర్న్‌షిప్‌ చేసే అవకాశం లభిస్తుంది. వారికి 12 నెలలపాటు ఈ అవకాశం లభిస్తుంది. ఈ సమయంలో ప్రతినెలా రూ.5,000 కూడా అందుకుంటారు. ఈ అద్భుతమైన స్కీమ్‌ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కేంద్ర బడ్జెట్‌ 2024 సమావేశంలోనే ప్రకటించారు. కేంద్ర మంత్రిత్వ శాఖ  www.pminternship.mca.gov.in ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఆధార్‌ అనుసంధానంతో ఈ పోర్టల్‌ యాక్సెస్‌ చేయవచ్చు. ఈ పోర్టల్‌  2024 అక్టోబర్‌ 12 నుంచి ఓపెన్‌ అయింది. 

ఈ ఇంటర్న్‌షిప్‌లో చేరిన తర్వాత రూ.6,000 వన్‌ టైమ్‌ గ్రాంట్‌, ప్రతినెలా ప్రభుత్వం రూ.4,500, కంపెనీ రూ.500 డీబీటీ ద్వారా క్రెడిట్‌ అవుతుంది. ఈ స్కీమ్‌కు 21 నుంచి 24 ఏళ్ల మధ్య ఉన్న భారతీయులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేవారు టెన్త్‌, ఇంటర్‌ , బీఏ, బీకాం, బీఎస్పీ, బీబీఏ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఇప్పటికే ఫుల్‌ టైం ఉద్యోగం చేస్తున్నవారు అర్హులు కాదు.  అదేవిధంగా ఎంబీఏ, ఎంబీబీఎస్‌ తదితర అడ్వాన్స్‌డ్‌ అర్హత సాధించినవారు కూడా అర్హులు కాదు. దరఖాస్తు చేసుకునేవారి కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.8 లక్షలు మించకూడదు.

ఏ ఇంటర్న్‌షిప్‌లు అందిస్తారు?
ప్రధాన మంత్రి ఇంటర్న్‌షిప్‌ పథకం ద్వారా సాఫ్ట్‌వేర్‌, బ్యాంకింగ్‌, ఆయిల్‌, గ్యాస్‌ అండ్‌ ఎనర్జీ, మైనింగ్‌, టెలికాం, రిటైల్‌, సిమెంట్‌, బిల్డింగ్‌ మెటీరియల్స్‌, ఫార్మాస్యూటికల్‌, ఏవియేషన్‌, మానుఫ్యాక్చరింగ్‌, అగ్రికల్చర్‌, జెమ్స్‌ జువెలరీ, ట్రావెల్‌ హాస్పిటలిటీ వంటి రంగాల్లో ఇంటర్న్‌షిప్‌ అందిస్తారు.

ఇదీ చదవండి: కేంద్రం బంపర్‌ ఆఫర్.. ప్రతినెలా రూ.3000 పొందే సూపర్‌‌ హిట్‌ స్కీమ్..!    

ఎంపిక ప్రక్రియ..
ఈ ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసుకున్నవారికి ఆబ్జెక్టీవ్‌ టెస్ట్‌ పెడతారు. అర్హులైన వారు పీఎం ఇంటర్న్‌షిప్‌కు రిజిస్టర్‌ చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగుల వివరాలతో ఎంపిక చేస్తారు. వారి పూర్తి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి వారు ఎంచుకున్న పరిశ్రమ నైపుణ్యాలు నేర్పిస్తారు. అంతేకాదు ఈ స్కీమ్‌లో అర్హత సాధించినవారు ప్రధాన మంత్రి జీవన్‌ జ్యోతి బీమా, ప్రధాన మంత్రి సురక్ష బీమా కవరేజీ కూడా లభిస్తుంది.

కావాల్సిన పత్రాలు..
ఆధార్‌ కార్డు, పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫోటో, విద్య అర్హత,నెటివిటీ సర్టిఫికేట్లు కలిగి ఉండాలి. ఇందులో 5 అవకాశాల్లో ఎదైనా ఒకటి ఎంపిక చేసుకోవచ్చు. మీకు స్థానం లభించకపోతే మళ్లీ ఏడాది దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైతే మీ ఇమెయిల్‌కు ఆఫర్ లెట్టర్‌ వస్తుంది. లేదా అధికారిక వెబ్‌సైట్‌లో కూడా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఇదీ చదవండి: మాజీ మంత్రి ఎన్సీపీ లీడర్‌ బాబా సిద్ధిఖీ దారుణ హత్య.. సల్మాన్‌ ఖాన్‌కు ఈ మర్డర్‌తో ఉన్న లింక్‌ అదేనా?

ఈ పథకంలో ఏడాది పూర్తి చేసిన తర్వాత ఉద్యోగానికి కేంద్రం హామీ ఇవ్వదు. కానీ, మీ కెరీర్‌ ను అత్యున్నత స్థాయికి చేరుస్తుంది. ఉపాధి అవకాశాలు బాగా పెరుగుతాయి. ఎందుకంటే ఇందులో మీరు టాప్‌ 500 కంపెనీల్లో ఇంటర్న్‌షిప్‌ చేస్తారు మీ నైపుణ్యతలు కూడా మెరుగవుతాయి.
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News