MP Eatala Rajender: ముఖ్యమంత్రిని మార్చేందుకు కాంగ్రెస్ భారీ కుట్ర.. ఎంపీ ఈటల సంచలన వ్యాఖ్యలు

MP Eatala Rajender Fires On Congress Govt: రాష్ట్రంలో ముఖ్యమంత్రిని మార్చేందుకు కాంగ్రెస్ మతకల్లోలాలు సృష్టిస్తోందని ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. కాంగ్రెస్ హయాంలోనే చాలా ప్రాంతాల్లో బాంబులు పేలాయన్నారు. బీజేపీ శాంతిని కోరుకుంటుందని.. ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేయమన్నారు.   

Written by - Ashok Krindinti | Last Updated : Oct 22, 2024, 05:20 PM IST
MP Eatala Rajender: ముఖ్యమంత్రిని మార్చేందుకు కాంగ్రెస్ భారీ కుట్ర.. ఎంపీ ఈటల సంచలన వ్యాఖ్యలు

MP Eatala Rajender Fires On Congress Govt: ఆలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంసం జరుగుతుందని గవర్నర్‌ను కలిశామని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఈ ఘటనల వెనుక ఎవరున్నారో ప్రభుత్వం బయటపెట్టలేదని.. ఎవరు ఎందుకు దాడి చేశారో చెప్పలేదన్నారు. ముత్యాలమ్మ ఆలయంలో దాడి చేసిన వారు పక్కనే హోటల్‌లో ఉన్నవారే అని స్థానికులు చెబుతున్నారని పేర్కొన్నారు. హిందువుల ర్యాలీలో బయట వారు కావాలని చేసిన పనికి భక్తులను చితక బాదారని మండిపడ్డారు. ప్రజలను కొట్టిన పోలీసులకే ప్రమోషన్ ఇస్తామని ప్రభుత్వం చెబుతుందని.. దీంతో తమపై కూడా హత్యాయత్నం కేసు నమోదు చేశారని తెలిపారు. బీజేపీ సమాజంలో శాంతి కాంక్షిస్తుందని.. ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేయమని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తమపై ఎందుకు అంత ధ్వేశ భావం కలిగి ఉన్నారని ప్రశ్నించారు.

Also Read: Gold News: అమాంతం రూ.15000 పెరిగిన తులం బంగారం ధర.. ఇక లక్ష దాటడం ఖాయం..!!  

"ఆలయాలపై దాడులు చే‌సిన వారిని పట్టుకోరు. సీఎంను దించడానికి మత కల్లోలాలు సృష్టించడం కాంగ్రెస్‌కు అలవాటు. మర్రి చెన్నారెడ్డిని దించడానికి, కోట్ల విజయభాస్కర్ రెడ్డిని దించడానికి మతకల్లోల్లాలు సృష్టించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నాడు అనేక ప్రాంతాల్లో బాంబులు పేలాయి. మోదీ ప్రధాని అయిన అనంతరం ఉగ్రవాదంపై ఉక్కు పాదం మోపుతామని ఇలాంటి ఘటనల పీక నొక్కారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో శాంతి నెలకొల్పిన పార్టీ మాది. ఆలయాలపై దాడులు చేస్తున్న వారిని వదిలి పెట్టి, శాంతియుత ర్యాలీ నిర్వహించిన మా పై కేసులు పెడుతున్నారు." అని ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు.

ద్వేషం రెచ్చగొట్టే వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆయన నిలదీశారు. ఎంఐఎం పార్టీ అఫీజ్మెంట్ కోసం కాకుండా ప్రజా పాలనపై దృష్టి సారించాలని హితవు పలికారు. రక్తపాతంను ఏ మత పెద్దలు ప్రోత్సహించరని.. ఇప్పటికైనా తమపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే జరిగే పరిణామాలకు సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలన్నారు. ప్రజల విశ్వాసంను పొందడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని అన్నారు. కేసీఆర్ హయాంలో హక్కులను కాలరాశారని విమర్శించారు. పోలీసులతో అణిచి వేస్తే అన్ని సమస్యలు పరిష్కారం కావన్నారు.

Also Read: Indian Railway: స్లీపర్‌ కోచ్‌లో రైలు ప్రయాణం చేస్తున్నారా? ఎంత లగ్గేజీ తీసుకెళ్లాలి? ఫైన్‌ పడుతుంది జాగ్రత్త..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News