Priyanka Gandhi: రాహుల్‌ గాంధీచెల్లెలు ప్రియాంక ఆస్తులు ఎన్నో తెలుసా? వయనాడ్‌లో గెలుస్తారా?

Priyanka Gandhi Assets Value: కేరళలోని వయనాడ్‌ లోక్‌సభ స్థానం నుంచి రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంకతో పోటీ చేస్తున్నారు. తాను ఖాళీ చేసిన స్థానం నుంచి తన చెల్లిని పోటీ చేయిస్తూ నామినేషన్‌ వేయించారు. ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ ఆస్తులు కళ్లు చెదిరేలా ఉన్నాయి.

1 /8

రాహుల్ వదులుకోవడంతో..: సార్వత్రిక ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి గెలిచిన రాహుల్‌ గాంధీ కేరళలోని వయనాడ్‌ను వదులుకున్న విషయం తెలిసిందే.

2 /8

అన్న స్థానంలో చెల్లి: రాజీనామా చేసిన వయనాడ్‌ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. ఇక్కడి నుంచి తన సోదరి ప్రియాంకా గాంధీ వాద్రాను పోటీ చేయిస్తున్నారు.

3 /8

సోనియా కుటుంబం: వయనాడ్‌లో బుధవారం భారీ ర్యాలీ చేపట్టిన అనంతరం ప్రియాంక గాంధీ నామినేషన్‌ వేశారు. ఆమె వెంట తల్లి సోనియా గాంధీ, సోదరుడు రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఉన్నారు.

4 /8

అఫిడవిట్ వివరాలు: నామినేషన్‌ సందర్భంగా ప్రియాంక గాంధీ సమర్పించిన అఫిడవిట్‌ వైరల్‌గా మారింది. ఆమె ఆస్తిపాస్తులపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

5 /8

చిన్న కారు: మొత్తం చరాస్తులు రూ.4.24 కోట్లు ఉన్నాయని అఫిడవిట్‌లో ప్రియాంక తెలిపారు. రూ.1.15 కోట్ల విలువైన బంగారం, రూ.8 లక్షల విలువైన కారు ఉందని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

6 /8

ఆస్తుల చిట్టా: అఫిడవిట్‌ ప్రకారం.. రూ.2.24 కోట్ల మ్యూచువల్‌ ఫండ్స్‌, బ్యాంకులో రూ.3.60 లక్షలు, పీపీఎఫ్‌ ఖాతాలో రూ.17.38 లక్షలు ఉన్నాయని ప్రియాంక తెలిపారు. చేతిలో రూ.52 వేల నగదు మాత్రమే ఉందని వివరించారు.

7 /8

మళ్లీ గెలుపు కోసం: వయనాడ్‌ ఉప ఎన్నికలో ఎలాగైనా గెలిచి తీరాలనే కసితో కాంగ్రెస్‌ పార్టీ ఉంది. తన స్థానాన్ని తిరిగి నిలబెట్టుకోవాలనే పట్టుదలతో రాహుల్‌ గాంధీ ఉన్నారు.

8 /8

గడ్డు పరిస్థితులు: మహారాష్ట్ర, జార్ఖండ్‌లో కూడా విజయం సాధించాలని కాంగ్రెస్‌ పార్టీ భారీ వ్యూహ రచనతో ఉండగా.. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే రెండు చోట్ల కాంగ్రెస్‌కు కొంత కష్టంగానే పరిస్థితులు ఉన్నాయి.