2019 చివరి సూర్యగ్రహణం

నూతన సంవత్సర వేడుకలకు సిద్ధమవుతున్న వేళ .. 2019లో చివరి అంకంలో మరో అద్భుతం కనువిందు చేయనుంది. క్రిస్మస్  పండుగ మరునాడు ఆకాశంలో అద్భుతం గోచరించనుంది. అదే 2019 సంవత్సరానికి చివరి సూర్యగ్రహణం.

Last Updated : Dec 26, 2019, 08:37 AM IST
 2019 చివరి సూర్యగ్రహణం

నూతన సంవత్సర వేడుకలకు సిద్ధమవుతున్న వేళ .. 2019లో చివరి అంకంలో మరో అద్భుతం కనువిందు చేయనుంది. క్రిస్మస్  పండుగ మరునాడు ఆకాశంలో అద్భుతం గోచరించనుంది. అదే 2019 సంవత్సరానికి చివరి సూర్యగ్రహణం. 

సంపూర్ణం కాదు పాక్షికమే..
డిసెంబర్ 26 గురువారం రోజున 2019 చివరి సూర్యగ్రహణం .. ఆకాశంలో అబ్బురపరచనుంది. ఈ సూర్యగ్రహణం.. భారత్ , ఆస్ట్రేలియా, ఫిలిప్పీన్స్, సౌదీ అరేబియా , సింగపూర్ వంటి దేశాల్లో కనిపించనుంది. ఐతే ఈసారి కనిపించేది సంపూర్ణ  సూర్యగ్రహణం కాదు. నిజానికి సూర్యునికి , భూమికి మధ్యలో చంద్రుడు రావడం వల్ల భూమిపై ఉన్న వారికి సూర్యుడు కనిపించడు. దీన్నే సూర్య గ్రహణం అంటారు. చంద్రుడు భూమికి ప్రస్తుతం దూరంగా ఉండడం వల్ల ఈసారి పాక్షిక సూర్యగ్రహణమే కనిపించనుంది. అంటే సూర్యుని చుట్టూ రింగ్ ఆకారంలో కాంతి ఏర్పడి కనిపిస్తుంది.  

సూర్యగ్రహణ సమయం
పాక్షిక సూర్యగ్రహణం.. ఆసియాలోని అన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో స్పష్టంగా కనిపించనుంది. డిసెంబర్ 26న ఉదయం 7 గంటల 59 నిముషాలకు ప్రారంభమై 10 గంటల 47 నిముషాల వరకు గ్రహణకాలం ఉంటుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. అందులో పూర్తి గ్రహణ కాలం 3 నిముషాల 40 సెకన్లు ఉంటుందని వివరించారు. ఐతే ఈ పాక్షిక సూర్యగ్రహణాన్ని ఉత్తర అమెరికా, బ్రిటన్ ప్రజలు చూసే అవకాశం లేదు. సూర్యగ్రహణాన్ని వీక్షించేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకోవాలి. లేదంటే కళ్లు చెడిపోయే అవకాశం ఉంది. ప్రత్యేకమైన కళ్లద్దాల ద్వారా సూర్యగ్రహణాన్ని చూడాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

పక్షం తర్వాత చంద్రగ్రహణం
మరోవైపు సూర్యగ్రహణం తర్వాత సరిగ్గా 15 రోజులకు చంద్రగ్రహణం ఏర్పడనుంది. అంటే 2020 జనవరి 10న ఆ ఏడాదికి చంద్రగ్రహణం ఏర్పడుతుంది.

Trending News