APSRTC Jobs: నిరుద్యోగులకు శుభవార్త, త్వరలో ఏపీఎస్సార్టీసీ ఉద్యోగాల భర్తీ, ఏయే ఉద్యోగాలంటే

APSRTC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. ఏపీఎస్సార్టీసీలో భారీగా ఉద్యోగాల భర్తీ జరగనుంది. ఆర్టీసీలో ఏయే శాఖల్లో ఎన్నెన్ని ఖాళీలున్నాయో వివరాలు ప్రభుత్వానికి అందాయి. ప్రభుత్వం ఆమోద ముద్ర వేస్తే త్వరలో నోటిఫికేషన్ వెలువడవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 27, 2024, 03:54 PM IST
APSRTC Jobs: నిరుద్యోగులకు శుభవార్త, త్వరలో ఏపీఎస్సార్టీసీ ఉద్యోగాల భర్తీ, ఏయే ఉద్యోగాలంటే

APSRTC Jobs: మరో 5 రోజుల్లో 16 వేల పోస్టులతో ఏపీడీఎస్సీ నోటిపికేషన్ వెలువడనుంది. ఆ తరువాత ఏపీఎస్సార్టీసీలో ఉద్యోగాల భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమౌతోంది. ఆర్టీసీలోని 18 కేటగరీల్లో మొత్తం 7545 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆర్టీసీ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక అందించింది. ప్రభుత్వం ఆమోదం తెలిపితే నోటిఫికేషన్ వెలువడనుంది. 

ఏపీఎస్సార్టీసీలో మొత్తం 18 కేటగరీల్లో 7545 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే త్వరలో భర్తీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందులో మొత్తం 3,673 డ్రైవర్ పోస్టులు, 1813 కండక్టర్ పోస్టులు, 656 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, 579 అసిస్టెంట్ మెకానిక్, శ్రామిక్ పోస్టులు, 207 ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ పోస్టులు, 179 మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీ పోస్టులు, 280 డిప్యూటీ సూపరింటెండెంట్ పోస్టులు ఉన్నాయి. ఇందులో డ్రైవర్ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ అవసరం. ఇక కండక్టర్ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణత, జూనియ్ అసిస్టెంట్ పోస్టులకు పదో తరగతితో పాటు ఐటీఐ కలిగి ఉండాలి. అసిస్టెంట్ మెకానిక్ పోస్టులకు డిగ్రీ, ట్రాఫిక్ సూపర్ వైజర్ పోస్టులకు బీటెక్, మెకానికల్ సూపర్ వైజర్ పోస్టులకు బీటెక్, డిప్యూటీ సూపరింటెండెంట్ పోస్టులకు డిగ్రీ ఉండాలి.

ఈ ఉద్యోగాలకు కనీస గరిష్ట వయస్సు 18 ఏళ్ల నుంచి 42 ఏళ్లుండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులకు వయస్సు సడలింపు ఉంటుంది. నెలవారీ జీతం ఎంపికైన పోస్టుల్ని బట్టి ఉంటుంది. జీతం 18,500 రూపాయల నుంచి 35 వేలుంటుంది. ఇది కాకుండా ప్రభుత్వపరంగా ఇతర ప్రయోజనాలు వర్తిస్తాయి. ఇందులో కొన్ని పోస్టులకు రాత పరీక్షతో పాటు ట్రేడ్ పరీక్ష కూడా ఉంటుంంది. 

Also read: Venkatesh Second Marriage: విక్టరీ వెంకటేశ్ రెండో పెళ్లి..ఆ హీరోయిన్‌తో జరిగిందా, అసలేం జరిగింది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News