ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో బంధీలుగా ఉన్న 20 మంది భారత మత్స్యకారులకు ఎట్టకేలకు విముక్తి లభించింది. పాక్‌లోని లంధి జైలులో ఉన్న తెలుగు జాలర్లను పాక్ అధికారులు ఆదివారం విడుదల చేశారు. భారత విదేశాంగ చొరవతోనే పాక్ మన జాలర్ల విడుదలకు నిర్ణయం తీసుకుంది. పంజాబ్‌లోని వాఘా సరిహద్దుకు సోమవారం(జనవరి 6న) తీసుకొచ్చి భారత అధికారులకు జాలర్లను అప్పగించనున్నారు.
పాక్ చెరలో ఉన్న భారత జాలర్ల విడుదల కోసం భారత విదేశాంగ ఇటీవల పాక్ విదేశాంగశాఖకు లేఖ రాసింది. జాలర్లను విడిచి పెట్టేందుకు నిర్ణయం తీసుకున్న పాక్ ఆ విషయాన్ని జనవరి 4న భారత అధికారులకు వెల్లడించింది. విడుదలకానున్న జాలర్ల వివరాలు విదేశాంగశాఖ అధికారులకు పాక్ ముందుగానే పంపింది. బతుకుదెరువు కోసం గుజరాత్ వలస వెళ్లిన జాలర్లు 2018 డిసెంబర్ నెలలో పాక్ ప్రాదేశిక జలాల ఏరియాలోకి ప్రవేశించగా.. పాక్ సిబ్బంది వారిని బంధించిన విషయం తెలిసిందే. జాలర్ల విడుదల కావడంపై వారి కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ వారిని కలుసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..