Heavy Rains: ఆంధ్ర ప్రదేశ్ కు భారీ వర్ష సూచన..

Heavy Rains: బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. బంగాళాఖాతం వాయవ్య ప్రాంతంలో ఈ ఆవర్తనం ఏర్పడినట్లు భారత వాతావరణ కేంద్రం తెలిపింది. క్రమంగా ఇది మరింత బలపడటానికి అనుకూల వాతావరణం ఉన్నట్లు అంచనా వేసింది.

 

1 /5

అల్పపీడన ప్రభావంతో ఈ నెల 7వ తేదీ నుంచి ఏపీ దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, అనంతపురం, సత్యసాయి పుట్టపర్తి జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

2 /5

ఉత్తర కోస్తా జిల్లాల్లో చెదురు మదురుగా వర్షాలు పడొచ్చని వాతావరణ కేంద్రం అంచనావేసింది.పలు జిల్లాల్లో నేడు ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ కూడా తెలిపింది.

3 /5

విజయనగరం, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, నెల్లూరు, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు,  శ్రీ సత్యసాయి పుట్టపర్తి, కడప, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయి.

4 /5

ఈ అల్పపీడన ప్రభావం అటు తమిళనాడుపైనా ఉండొచ్చు. చెన్నై సహా ఉత్తర కోస్తా జిల్లాలు- చెంగల్పట్టు,  తిరుపత్తూర్, కాంచీపురం, కడలూర్‌లల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి.

5 /5

మత్స్యకారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు సూచించారు.ఎవరు చేపల వేటకు.. సముద్ర స్నానాలకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది.