స్మార్ట్‌ఫోన్ల తయారీ దిగ్గజం రియల్ మి సరికొత్త మోడల్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. తమ తొలి 5జీ స్మార్ట్‌ఫోన్ రియల్‌మి ఎక్స్50 5జీని జనవరి 7న చైనా మార్కెట్‌లో విడుదల చేసింది. 6.57 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్ ప్లే వస్తుంది. ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 765జి ప్రాసెసర్‌తో వచ్చిన ఈ మొబైల్స్ 6, 8, 12 జీబీ ర్యామ్ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. నీలం, నలుపు, గోల్డ్, ఉదా రంగులలో ఈ మొబైల్స్‌ను తీసుకొచ్చారు.
అత్యధికంగా 256 జీబీ వరకు స్టోరేజ్‌ను పెంచుకునే వీలుంది. ఆండ్రాయిడ్10 ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడిచే ఈ ఫోన్ బ్యాటరీ సామర్థం భేష్. అన్ రిమూవబుల్ 4200ఎంఏహెచ్ బ్యాటరీతో మోడల్‌ను రియల్ మి ప్రవేశపెట్టింది. 64,12, 8, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలతో పాటు, 8 మెగాపిక్సల్, 16 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరాలున్నాయి. డ్యుయల్ సిమ్ కార్డ్ స్టాట్, 4జీ వివో ఎల్టీఈ, 5.0 బ్లూటూత్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింగ్ స్కానర్ ఫీచర్లున్నాయి. ఫాస్ట్ ఛార్జింగ్ మోడల్ ప్లస్ పాయింట్ అని కంపెనీ చెబుతోంది.
రియల్ మి X50 ధరలు ఇలా ఉన్నాయి. 8జీబీ ర్యామ్, ఎక్స్‌ప్యాండబుల్ స్టోరేజీ 128 జీబీ ఉండే వేరియంట్ ధర రూ.25,790. 6జీబీ ర్యామ్, ఎక్స్‌ప్యాండబుల్ స్టోరేజీ 256 ఉండే వేరియంట్‌ను రూ.27,860కి విక్రయించనున్నట్లు తెలుస్తోంది. 12జీబీ ర్యామ్, 256జీబీ వరకు స్టోరేజీని పెంచుకునే వీలున్న మోడల్ రూ.30,960కి భారత మార్కెట్‌లోకి రానున్నట్లు సమాచారం. మొబైల్ లాంఛింగ్‌తో పాటు రూ.3999 విలువచేసే రియల్ మి వైర్ లెస్ ఇయర్ బడ్స్‌ను సంస్థ తీసుకొచ్చింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..