అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగ యువతకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ మరిన్ని కొలువులను తీసుకొచ్చింది. గతేడాది లక్ష ఉద్యోగాలు భర్తీ చేసిన ఏపీ సర్కార్ తాజాగా 16,207 గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ జనవరి 10న ఈ పోస్టులకు జారీ చేశారు. గ్రామ సచివాలయ ఉద్యోగాలు 14,061 ఉండగా, వార్డు సచివాలయ ఉద్యోగాలు 2,146 ఉన్నాయి.
శనివారం(జనవరి 11) నుంచి అభ్యర్థులు ఆన్లైన్లో సచివాలయ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి 31 అర్ధరాత్రి దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది. గతేడాది సచివాలయ ఉద్యోగాలకు పేర్కొన్న ఆయా విభాగాల విద్యార్హతలే వీటికి సైతం వర్తిస్తాయని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇదివరకే సర్వీసులో కొనసాగుతున్నవారికి 10శాతం మేర వెయిటేజీ లభిస్తుంది. మార్చి చివర్లో లేక ఏప్రిల్లో ఈ పోస్టులకు రాత పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది.
గ్రామ సచివాలయ ఉద్యోగాలు
పోస్టులు - ఉద్యోగాలు
పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-5 - 61
వెటర్నరీ అసిస్టెంట్ - 6,858
విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ - 1782
విలేజ్ సర్వేయర్ గ్రేడ్-3 - 1255
డిజిటల్ అసిస్టెంట్ - 1134
విలేజ్ వెల్ఫేర్ సెక్రటరీ - 762
ఏఎన్ఎం గ్రేడ్-3 - 648
విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గ్రేడ్-2 536
ఇంజినీరింగ్ అసిస్టెంట్ - 570
వీఆర్వో గ్రేడ్-2 - 246
వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ - 97
విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ - 69
విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ - 43
గ్రామ సచివాలయ మొత్తం ఉద్యోగాలు- 14,061
వార్డు సచివాలయ ఉద్యోగాలు
పోస్టులు - ఉద్యోగాలు
వార్డ్ ప్లానింగ్, రెగ్యులేషన్ సెక్రెటరీ - 844
వార్డ్ శానిటేషన్, ఎన్విరాన్మెంట్ సెక్రెటరీ - 513
వార్డ్ అమినిటీస్ సెక్రటరీ - 371
వార్డ్ వెల్ఫేర్, డెవెలప్మెంట్ సెక్రెటరీ - 213
వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రెటరీ - 105
వార్డ్ ఎడ్యుకేషన్, డేటా ప్రాసెసింగ్ సెక్రెటరీ- 100
వార్డు సచివాలయ మొత్తం పోస్టులు - 2,146