Heart Attack: మహిళలకు గుండెపోటు వచ్చే ముందు కనిపించే లక్షణాలు ఇవే.. ముందస్తు జాగ్రత్తపడకుంటే?

Heart Attack Symptoms In Women: హార్ట్ ఎటాక్ అంటేనే ప్రాణాంతక వ్యాధి ఇది ప్రాణాలను తీస్తుంది హార్ట్ ఎటాక్ తో చిన్న పెద్దాయన తేడా లేకుండా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు అయితే హార్ట్ ఎటాక్ ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.

Written by - Renuka Godugu | Last Updated : Nov 13, 2024, 08:55 PM IST
Heart Attack: మహిళలకు గుండెపోటు వచ్చే ముందు కనిపించే లక్షణాలు ఇవే.. ముందస్తు జాగ్రత్తపడకుంటే?

Heart Attack Symptoms In Women: చిన్న పెద్ద అనే తేడా లేకుంటే అటాక్ చేస్తున్న హార్ట్ ఎటాక్ తో కొన్ని లక్షణాలను ముందుగానే తెలుసుకోవచ్చు దీంతో కాస్త ముందు జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాల తో బయటపడతారు. అయితే హార్ట్ ఎటాక్ అనేది మగవారు ఆడవాళ్ళలో కొన్ని తేడాలు ఉంటాయి. ఆడవాళ్ళలో కొన్ని ప్రత్యేక లక్షణాలు కనిపిస్తాయి అవి కనిపించని వెంటనే వారు జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాంతక సమస్య నుంచి బయటపడవచ్చు.

హార్ట్ ఎటాక్ అనేది మన జీవనశైలి సరిగా లేకపోవడం వల్ల అటాక్ చేస్తుంది. అంతేకాదు మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు లేకపోయినా హార్ట్ ఎటాక్ సమస్యతో చనిపోతున్నారు. ఇది కాకుండా బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో లేకపోతే కూడా హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఫ్యామిలీ హిస్టరీలో హార్ట్ ఎటాక్ తో చనిపోయినవారు ఉన్న వారి తర్వాతి తరం వారిని కూడా ఈ హార్ట్ ఎటాక్ వెంటాడుతోంది. ఇది కూడా మరో లక్షణం. అయితే ఆడవాళ్లలో కొన్ని లక్షణాలు ప్రత్యేకంగా కనిపిస్తాయి వాటిని ముందుగానే చూసి గుర్తించవచ్చు అవి ఏంటో తెలుసుకుందాం.

చెమటలు..
ఏ కారణం లేకుండా చెమటలు పట్టడం ఆడవాళ్ళలో కనిపించే హార్ట్ ఎటాక్ లక్షణం. ఈ లక్షణం కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించండి. ఈ చెమటలు కూడా తక్కువ అంచనా వేసి అలాగే వదిలేస్తే ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. తరచూ ముఖ్యంగా రాత్రి సమయంలో చెమటలు వస్తే హార్ట్ ఎటాక్ లక్షణం ఇది మహిళల్లో కనిపించే ప్రధాన సింప్టమ్‌.

ఛాతి మంట..
కొంతమందిలో కనిపించే హార్ట్ ఎటాక్ లక్షణం. ఛాతిలో మంటగా అనిపించడం జీర్ణక్రియ మందగించడం ఇవి కూడా హార్ట్ ఎటాక్ లక్షణమే ముఖ్యంగా మహిళల్లో తరచుగా ఛాతి మంట , జీర్ణక్రియ మందగిస్తే వైద్యులను వెంటనే సంప్రదించాలి.

ఛాతి నొప్పి..
మహిళల్లో కనిపించే సాధారణ లక్షణం ఇది కొంతమంది మామూలు ఛాతీనొప్పి అని తక్కువ అంచనా వేస్తారు. కానీ అది తర్వాతి కాలంలో హార్ట్ ఎటాక్ కి లక్షణం. ఇది హార్ట్ ఎటాక్ కి దారితీస్తుంది. దీంతో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. తరచూ చాతి నొప్పి వచ్చినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించాలి.

ఇదీ చదవండి: అచ్చ తెలుగు గోంగూర పప్పు.. ఇలా చేశారంటే ఒక్క ముద్ద మిగలదు..

శ్వాస..
కొంత మందికి హార్ట్ ఎటాక్ లో వచ్చిన ముందు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. ఈ లక్షణం కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలి. ముఖ్యంగా ఇది ఎక్కువగా ఆడవారిలో కనిపిస్తుంది. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాంతక పరిస్థితుల నుంచి బయటపడవచ్చు.

అలసట..
కొంతమంది ఏం చిన్న పని చేసిన అలసిపోతారు. దీంతో ఏదో విటమిన్ లోపం వల్ల అలా జరుగుతుంది అనుకుంటారు కానీ ముఖ్యంగా మహిళల్లో ఏ చిన్న పని చేసిన అలసిపోతే వారికి హార్ట్ ఎటాక్ లక్షణం అని గుర్తించాలి. వెంటనే వైద్యులను సంప్రదించి సరైన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి

ఇదీ చదవండి: క్యాలరీలు తక్కువగా ఉండే ఈ 5 కూరగాయలతో బెల్లీఫ్యాట్‌ కరిగిపోవడం ఖాయం..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News