Pushpa 2: ప్యాన్ ఇండియా మూవీస్ విషయంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఆ జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ అల్లు అర్జున్ పుష్ప 2 విషయంలో ఆ జాగ్రత్త తీసుకొని ఉంటే.. ఈ సినిమా వేరే లెవల్లో ఉండేదని అభిమానులు చెప్పుకుంటున్నారు. పుష్ప 2 విషయంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అదే ఫీల్ అవుతున్నారు.
Pushpa 2: ప్రస్తుతం ఏ ఇండస్ట్రీలో లేనట్టుగా తెలుగులోనే ఎక్కువ మంది స్టార్ హీరోలతో పాటు ప్యాన్ ఇండియా స్టార్స్ ఉన్నారు. ప్రభాస్ నుంచి మొదలు పెడితే.. అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లు అందరు ప్యాన్ ఇండియా మార్కెట్ లో దూసుకుపోతున్నారు. అయితే.. ఈ ప్యాన్ ఇండియా మార్కెట్లో ఎన్టీఆర్ , రామ్ చరణ్ లు మాత్రం తన పాత్రలకు తామే డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం.
కానీ అల్లు అర్జున్ మాత్రం ‘పుష్ప 2’ విషయంలో హిందీలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటే బాగుండేది ఆయన అభిమానులు చెప్పుకుంటున్నారు.
ఆర్ఆర్ఆర్ సినిమా కోసం హిందీ, తమిళం, కన్నడలో తమ పాత్రలకు తామే డబ్బింగ్ చెప్పుకున్నారు రామ్ చరణ్, ఎన్టీఆర్. ఒక్క మలయాళ భాషలో మాత్రమే వేరే వాళ్లు వీళ్ల పాత్రకు డబ్బింగ్ చెప్పారు.
ఇక ‘దేవర’ సినిమా కోసం మలయాళం తప్పించి అన్ని భాషల్లో ఎన్టీఆర్ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. ఆయా భాషల్లో ఆడియన్స్ కు కనెక్ట్ కావడానికి ఇది బాగా యూజ్ అవుతోంది.
ఇక సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప 2’ సినిమా హిందీ వెర్షన కోసం అల్లు అర్జున్ పాత్రకు శ్రేయస్ తల్పడే డబ్బింగ్ బాగా పాపులర్ అయింది. ఇక పుష్ప 2 కోసం అల్లు అర్జున్ పాత్రకు శ్రేయస్ తల్పడే డబ్బింగ్ హెల్ప్ అవుతుందని భావించి అతనితోనే డబ్బింగ్ చెప్పించారు.
ఒక వేళ అల్లు అర్జున్ తన క్యారెక్టర్ కు తానే డబ్బింగ్ చెప్పుకొని ఉంటే హిందీ ప్రేక్షకులకు మరింత చేరవ అయ్యేవారనే టాక్ నడస్తోంది. మరి రాబోయే సినిమాల విషయంలో అల్లు అర్జున్ హిందీతో పాటు కన్నడ, తమిళంలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుుకుంటాడా లేదా అనేది చూడాలి.