YS Viveka Murder: తన తండ్రిని హత్య చేసిన వారిని డాక్టర్ వైఎస్ సునీతా రెడ్డి వదిలిపెట్టే ప్రసక్తే లేనట్టు ఉంది. తన తండ్రి హంతకులను శిక్షించే వరకు ఆమె వెనక్కి తగ్గకుండా పోరాడుతున్నారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసిన ఆమె.. రెండోసారి హోంమంత్రి వంగలపూడి అనితతో సమావేశమయ్యారు. తన తండ్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన కేసు ఎక్కడి వరకు వచ్చిందని.. ఏం చర్యలు తీసుకుంటున్నారని అడిగేందుకు వెళ్లినట్లు సమాచారం.
Also Read: Anganwadi: ఏపీ ప్రభుత్వం బంపర్ బొనాంజా.. అంగన్‌వాడీ కార్యకర్తలకు గ్రాట్యూటీ
అమరావతిలోని ఏపీ అసెంబ్లీలో సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల మధ్య మంగళవారం డాక్టర్ వైఎస్ సునీతా అక్కడకు వెళ్లారు. హోంమంత్రి వంగలపూడి అనితతో సునీత భేటీ అయ్యారు. వైఎస్ వివేకా హత్య కేసుపై చర్చించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతోనూ ఆమె భేటీ అయ్యారని ప్రచారం జరుగుతోంది. తన తండ్రి హత్య కేసులో పురోగతిపై వారితో చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి జైలు అధికారులకు రాసిన లేఖపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని ఈ సందర్భంగా వైఎస్ సునీత కోరినట్లు సమాచారం. సుప్రీంకోర్టులో వైఎస్ అవినాశ్ రెడ్డి బెయిల్ రద్దుకు సంబంధించి కేసు విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అఫిడవిట్ వేయడంతోపాటు.. ఈ కేసు దర్యాప్తులో పురోగతిపై అడిగి తెలుసుకున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా కోర్టు కేసులు, దస్తగిరి జైలు అధికారులకు రాసిన లేఖలపై అధికారులతో మాట్లాడినట్లు సమాచారం. వీటిపై రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి స్పందన రావాలని కోరినట్లు అసెంబ్లీ వర్గాలు వెల్లడించాయి
తన తండ్రి హత్య కేసులో నిజమైన దోషులను శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు వైఎస్ సునీత విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమవడం గమనార్హం. ఈ కేసులో అవినాశ్‌కు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. సునీత, రాజశేఖరరెడ్డిల తరపున సీనియర్ కౌన్సిలర్ సిద్ధార్ధ లూథ్రా వాదనలు వినిపిస్తున్నారు. అయితే సీబీఐ, అవినాశ్ తరపున ఎవరూ విచారు హాజరుకాకపోవడం గమనార్హం. సుప్రీంకోర్టు బెయిల్ రద్దు చేస్తే మాత్రం అవినాశ్ రెడ్డిని ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter