సారా అలీఖాన్ తరువాతి సినిమా ఇదే...

బాలీవుడ్‌లో 'కేదార్‌నాథ్', 'సింబ' సినిమాలతో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ సారా అలీఖాన్. ఈ రెండు ప్రాజెక్టుల తర్వాత సారా అలీ ఖాన్ నటించబోతున్న కొత్త సినిమా ఏంటీ అనే స్పెక్యులేషన్ మొదలైంది. కానీ నిన్నటి వరకు ఆమె ఎలాంటి కొత్త ప్రాజెక్టులకు ఒప్పుకోలేదు. 

Last Updated : Jan 30, 2020, 01:02 PM IST
సారా అలీఖాన్ తరువాతి సినిమా ఇదే...

బాలీవుడ్‌లో 'కేదార్‌నాథ్', 'సింబ' సినిమాలతో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ సారా అలీఖాన్. ఈ రెండు ప్రాజెక్టుల తర్వాత సారా అలీ ఖాన్ నటించబోతున్న కొత్త సినిమా ఏంటీ అనే స్పెక్యులేషన్ మొదలైంది. కానీ నిన్నటి వరకు ఆమె ఎలాంటి కొత్త ప్రాజెక్టులకు ఒప్పుకోలేదు. ఐతే తాజాగా .. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ ధనుష్ తో జత కడుతున్నట్లు ఆమె వెల్లడించింది. 'అత్రంగి రే' సినిమాలో అక్షయ్ కుమార్, ధనుష్‌తో కలిసి నటిస్తున్నట్లు తెలిపింది. 

సారా అలీఖాన్ ఇందుకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దీంతో ఆమె తర్వాతి సినిమా ఏంటనే దానిపై క్లారిటీ వచ్చింది. ఈ సినిమా షూటింగ్ కోసం ఎంతో ఉత్సాహంతో వేచి ఉన్నానంటూ సారా అలీఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం విశేషం. 'అత్రంగి రే' సినిమాకు ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించనున్నారు. అక్షయ్ కుమార్ ఇందులో ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.  2013 తర్వాత ధనుష్ , ఆనంద్ ఎల్ రాయ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా  'అత్రంగి రే' కావడం విశేషం.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

I can’t believe my luck 💫🌼☀️🌞🤩 My next film 🎥 🎞 : ATRANGI RE 👏🏻 Blessed to be working with @aanandlrai sir 🙏🏻 🤗 In an @arrahman musical 🎶 And so thankful to have @akshaykumar sir join hands with the extremely talented and incredibly humble @dhanushkraja and myself 🤝🤜🤛 Presented by @itsbhushankumar's @TSeries, @cypplofficial & #capeofgoodfilms 💁🏻‍♀️ And written by Himanshu Sharma Sir 📝📚 CANNOT WAIT TO START🧿💙 And cannot wait to come ⏰ Again, on Valentine’s Day ❤️ 14th February 2021‼️

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News