Kidney Superfoods: కిడ్నీ వ్యాధులకు చెక్ చెప్పే 4 వెజిటేరియన్ సూపర్ ఫుడ్స్ ఇవే

Kidney Superfoods: మనిషి శరీరంలో గుండె, లివర్, లంగ్స్ ఎంత ముఖ్యమో అంతకంటే ఎక్కువ కిడ్నీలని చెప్పవచ్చు. శరీరంలో ఫిల్టరేషన్ ప్రక్రియ కిడ్నీలతోనే జరుగుతుంటుంది. కిడ్నీల్లో ఎలాంటి సమస్య ఉత్పన్నమైనా ప్రాణాంతకం కూడా కావచ్చు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 21, 2024, 10:35 AM IST
Kidney Superfoods: కిడ్నీ వ్యాధులకు చెక్ చెప్పే 4 వెజిటేరియన్ సూపర్ ఫుడ్స్ ఇవే

Kidney Superfoods: శరీరంలోని వివిధ భాగాల్లో, వివిధ రూపాల్లో పేరుకుపోయే వ్యర్ధాలు, విష పదార్ధాలను బయటకు తొలగించడం కిడ్నీల పని. ఈ ప్రక్రియలో అంతరాయం ఏర్పడితే అనారోగ్య పరిస్థితులు తలెత్తుతాయి. నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాంతకం కూడా కావచ్చు. అందుకే కిడ్నీలు ఆరోగ్యంగా ఉండేట్టు చూసుకోవాలి. 

కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ముందుగా చేయాల్సింది ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పు. హెల్తీ ఫుడ్స్ తినడం, లైఫ్‌స్టైల్ మార్చుకోవడం ద్వారా కిడ్నీలను సంరక్షించుకోవచ్చు. లేకపోతే దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులు, కిడ్నీలో రాళ్లు, కిడ్నీ ఇన్‌ఫెక్షన్, పోలీసిస్టిక్ కిడ్నీ డిసీజ్, కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యలు ఉత్పన్నం కావచ్చు. అందుకే కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకునే ఫుడ్స్ డైట్‌లో చేర్చుకోవల్సి ఉంటుంది. వీటిలో ప్రముఖంగా చెప్పుకోవల్సింది వెల్లుల్లి. ఆయుర్వేదంలో వెల్లుల్లికి చాలా ప్రాధాన్యత ఉంది. వెల్లుల్లిని సాధారణంగా వంటల్లో రుచి కోసం వినియోగిస్తుంటారు. కానీ ఆరోగ్యపరంగా ఇది చాలా అద్భుతమైంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఫలితంగా కిడ్నీలు ఆరోగ్యంగా ఉండేందుకు దోహదం చేస్తుంది. 

డైట్‌లో ఆకు కూరలు తప్పకుండా ఉండేట్టు చూసుకోవాలి. ఎందుకంటే ఇందులో ఉండే విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్లు కిడ్నీలను సంరక్షించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. శరీరంలోని విష పదార్ధాలను బయటకు పంపించి బాడీని డీటాక్స్ చేస్తాయి. దీనికోసం పాలకూర, తోటకూర, మెంతి కూర వంటి ఆకు కూరల్ని వారంలో కనీసం 4 సార్లు తీసుకోవాలి. ఇక మరో ముఖ్యమైన పదార్ధం తృణ ధాన్యాలు. మీ రెగ్యులర్ డైట్‌లో క్వినోవా, బ్రౌన్ రైస్, వైట్ బ్రెడ్ వంటివి ఉండాలి. 

ఇక చివరిది చిలకడ దుంప. ఇది రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలు అందిస్తుంది. కిడ్నీలకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే విటమిన్లు, ఫైబర్, మినరల్స్ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతాయి, ఇందులో సోడియం తక్కువ పరిమాణంలో ఉండటం వల్ల ఆరోగ్యం బాగుపడుతుంది.

Also read: Healthy Lungs Remedies: ఈ ఫ్రూట్స్ తింటే చాలు ఊపిరితిత్తుల్లో పేరుకున్న చెత్తంతా డీటాక్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News