Multani Mitti: ముఖానికి ఈ ఫేస్ ప్యాక్ వేసుకుంటే చాలు.. పార్లర్‌కు వెళ్లాల్సిన పనిలేదు..

Multan Mitti in Skin Care Routine: ప్రతిరోజు ఆఫీసులో వివిధ పనులకు బయటకు వెళ్తాం. దీంతో ముఖంపై జిడ్డు, వ్యర్ధాలు పేరుకుపోయి అందంగా కనిపిస్తాయి. అయితే మూల్తానీ మిట్టి దీనికి ఎఫెక్టివ్ రెమిడి. చర్మంపై ఉన్న డెడ్ సెల్ స్కిన్ ని తొలగిస్తుంది.

Written by - Renuka Godugu | Last Updated : Nov 23, 2024, 02:06 PM IST
Multani Mitti: ముఖానికి ఈ ఫేస్ ప్యాక్ వేసుకుంటే చాలు.. పార్లర్‌కు వెళ్లాల్సిన పనిలేదు..

Multan Mitti in Skin Care Routine: పార్లర్‌కు వెళ్లకుండానే ఇంట్లోనే సహజమైన గ్లో పొందాలనుకుంటున్నారా? ముఖంపై మెరుగైన ఫలితాలు పొందాలంటే చర్మంపై ఈ ముల్తానీ మిట్టిని ఉపయోగించండి. దీంతో ముఖం పై వ్యర్థాలను తొలగించి, పునరుజ్జీవనం అందిస్తుంది. ముఖానికి అప్లై చేయడం వల్ల మెరిసే అందం మీ సొంతమవుతుంది. ఏదైనా పార్టీలు, పెళ్లిళ్లకు వెళ్లే ముందు కూడా ఈ ప్యాక్‌ వేసుకోవచ్చు. దీంతో మెరిసే అందం మీసొంతం. అయితే ముఖానికి ఈవెన్‌ టోన్ కూడా పొందవచ్చు. ముల్తానీ మట్టితో కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.

ముల్తానీ మిట్టిని పీల్‌ ఆఫ్‌ మాస్క్‌ ఎందులో అయినా మీకు నచ్చిన బ్రాండ్‌ ఉపయోగించి మాస్క్‌ వేసుకుని ఆరిన తర్వాత పీల్‌ ఆఫ్‌ చేసినా ముఖం పై ఉండే రంధ్రాలు తొలగిపోతాయి. వ్యర్థాలు క్లియర్‌ అయిపోతాయి. 

ముల్తానీ మిట్టిలో మెగ్నీషియం, కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మానికి ఆరోగ్యకరంగా కనిపించేలా చేసి పునరుజ్జీవనం అందిస్తుంది. అంతేకాదు ముల్తానీ మిట్టితో చర్మం పై పేరుకున్న యాక్నే, మచ్చలు తొలగిపోతాయి. చర్మ సంబంధిత సమస్యలు మీ దరిదాపుల్లోకి కూడా రావు.

ఇదీ చదవండి: ప్రతిరోజు క్యారెట్ తినడం వల్ల కలిగే 7 ప్రయోజనాలు.. మీరు అస్సలు నమ్మలేరు..

ముల్తానీ మిట్టి అప్లై చేయడం వల్ల ముఖంపై ఉన్న అదనపు నూనెను గ్రహించేస్తుంది. చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది ముఖం క్లియర్ గా కనిపిస్తుంది. ఇది జిడ్డు చర్మం వారికి ఎఫెక్టీవ్‌గా పనిచేస్తుంది. ముల్తానీ మిట్టి చర్మంపై పేరుకున్న మచ్చలు, మొటిమలు తొలగించేసి ఛాయ మెరుగుపరుస్తూ ఉంఉటంది. ఇది స్కిన్‌ కేర్‌ రొటీన్‌ లో చేర్చుకుంటేసమర్థవంతంగా పనిచేస్తుంది. దీంతో పార్లర్‌కు వెళ్లకుండానే ముఖం సహజ సిద్ధంగా మెరిసిపోతుంది.

ముల్తానా మిట్టిని నిమ్మరసంలో వేసి ముఖానికి అప్లై చేయడం వల్ల మెరుగైన ఫలితాలు పొందుతారు. దీంతో మీరు కావాలంటే రోజ్ వాటర్ కూడా యాడ్ చేసుకుని ముఖం మెడ భాగంలో అప్లై చేసి ఆరిన తర్వాత నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి. మూల్తానీ మిట్టిని కేవలం రోజ్ వాటర్ లో కూడా కలిపి పేస్ట్ మాదిరి తయారు చేసుకొని ముఖానికి మెడ భాగంలో అప్లై చేయవచ్చు. దీన్ని రోజు విడిచి రోజు ఉపయోగించినా మంచి ఫలితాలు పొందుతారు. గోరువెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.

ఇదీ చదవండి: డిసెంబర్‌లో కూడా కేవలం 15 రోజులు మాత్రమే బ్యాంకులు పనిచేస్తాయి.. ఎందుకో తెలుసా?

అంతేకాదు ముఖానికి తేనే, పెరుగు కూడా అప్లై చేయవచ్చు. దీంతో ముల్తానీ మిట్టి వేసి ముఖానికి అప్లై చేయడం వల్ల మంచి మాయిశ్చర్ అందుతుంది. ఇది సహజసిద్ధమైన గ్లో కూడా అందిస్తుంది. అన్ని రకాల చర్మం వారికి ఇది ఉపయోగకరం. బొప్పాయితో కూడా ముల్తానా మిట్టి ఉపయోగించవచ్చు. మంచి పండిన బొప్పాయి గుజ్జులో ముల్తాని మిట్టి వేసి ముఖానికి అప్లై చేసి అరగంట ఆగిన తర్వాత ఫేస్ వాష్ చేయాలి .ఇలా చేస్తే మీ ఛాయ మెరుగు పడుతుంది విటమిన్ సి, విటమిన్ ఏ మీ ముఖాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. సహజసిద్ధమైన గ్లో అందిస్తుంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x