IPL 2025 Mega Auction: క్రికెట్ ప్రేమికులందరి దృష్టీ ఇప్పుడు ఐపీఎల్ 2025 మెగా వేలంపైనే పడింది. ఇవాళ, రేపు రెండ్రోజులు సౌదీ అరేబియాలోని జెద్దా వేదికగా జరగనున్న వేలంలో ఆటగాళ్లకు రికార్డు ధర పలికే అవకాశాలున్నాయి. ఈసారి బరిలో స్టార్ ఆటగాళ్లు చాలామంది ఉండటమే ఇందుకు కారణం. ఏయే ఆటగాళ్లకు జాక్ పాట్ తగలనుందో చూడాలి.
ఇవాళ జరిగే మెగా వేలంలో మొత్తం 204 స్లాట్స్ ఖాళీగా ఉన్నాయి. మొత్తం 574 మంది ఆటగాళ్లు బరిలో నిలిచారు. వీరిలో 366 మంది భారతీయులు కాగా 208 మంది విదేశీలుయున్నారు. ఓవర్సీస్ స్లాట్స్ 70 ఉన్నాయి. వాస్తవానికి ఇవాళ మద్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కావల్సి ఉన్నా పెర్త్‌లో జరుగుతున్న టెస్ట్ కారణంగా మద్యాహ్నం 3 గంటలకు వాయిదా వేశారు. 574 మంది ఆటగాళ్లు 8 కేటగరీల్లో ఉన్నారు. అత్యధిక బేస్ ధర 2 కోట్లతో 81 మంది బరిలో ఉన్న ఆటగాళ్లలో రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, మొహమ్మద్ షమి, మొహమ్మద్ సిరాజ్ ఉన్నారు. ఇక 1.5 కోట్ల కేటగరీలో 27 మంది 1.25 కోట్ల విభాగంలో 18 మంది, 1 కోటి కేటగరీలో 23 మంది ఉన్నారు. ఇక 75 లక్షల కేటగరీలో 92 మంది, 50 లక్షల కేటగరీలో 8 మంది, 40 లక్షల కేటగరీలో 5 మంది ఉండగా, 30 లక్షల బేస్ ప్రైస్ కేటగరీలో అత్యధికంగా 320 మంది ఉన్నారు.
ఈసారి వేలానికి పంజాబ్ కింగ్స్ అత్యధిక వ్యాలెట్ 110.5 కోట్లతో స్టార్ ఆటగాళ్లపై దృష్టి పెట్టింది. ఇక ఆ తరువాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అత్యధికంగా 83 కోట్లతో , ఢిల్లీ కేపిటల్స్ జట్టు 73 కోట్లతో బరిలో దిగుతున్నాయి. గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు చెరో 69 కోట్లతో రంగంలో దిగుతున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 55 కోట్లతో, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు 51 కోట్లతో వేలానికి సిద్ధమయ్యాయి. ఇక హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్లు చెరో 45 కోట్లతో సిద్ధం కాగా రాజస్థాన్ రాయల్స్ జట్టు 41 కోట్లతో బరిలో దిగుతోంది.
ఈసారి అత్యదిక ధర ఎవరికి దక్కుతుందనేది చాలా ఆసక్తిగా మారింది. గత సీజన్లో ఆస్ట్రేలియన్ పేస్ బౌలర్ మిచెల్ స్టార్క్‌ను కేకేఆర్ జట్టు అత్యధికంగా 24.75 కోట్లకు కొనుగోలు చేసి ఈసారి రిలీజ్ చేసేసింది. దాంతో స్టార్క్ సహా రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, మొహమ్మద్ షమీలపై అందరి దృష్టీ ఉంది. వీరితో పాటు ఇంగ్లండ్ బ్యాటర్ జోస్ బట్లర్, అర్షదీప్ సింగ్, ఇషాన్ కిషన్, మొహమ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్‌లపై కూడా ఫ్రాంచైజీలు దృష్టి సారించాయి.
ఈసారి జరగనున్న వేలంలో మొత్తం 10 ఫ్రాంచైజీల వద్ద 641 కోట్లున్నాయి. వేలానికి 574 మంది సిద్ధంగా ఉన్నా 204 మందికే అదృష్టం వరించనుంది. రెండ్రోజులు జరిగే మెగా వేలం లైవ్ స్ట్రీమింగ్ ఇండియాలో స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో వీక్షించవచ్చు. ఆస్ట్రేలియాలో ఫాక్స్ స్పోర్ట్స్, కయో స్పోర్ట్స్, యూఎస్ఏ-కెనడాలో స్లింగ్ టీవీ, విల్లో టీవీలో చూడవచ్చు. ఇక పాకిస్తాన్లో తప్మాడ్, ఆఫ్ఘనిస్తాన్‌లో అరియానా, దక్షిణాఫ్రికాలో సూపర్ స్పోర్ట్స్ ఛానెల్లో లైవ్ చూడవచ్చు.
Also read: AUS vs IND 1st Test Live: ఆస్ట్రేలియాకు భారీ షాక్.. జస్ప్రిత్ బుమ్రా 5 వికెట్లతో 104కే ఆలౌట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.