Wedding Tradition: పెళ్లి కూతురు.. అత్తారింటికి వెళ్లేటప్పుడు మర్చిపోయి కూడా వీటిని తీసుకెళ్లకూడదంట..

Bride: కొత్తగా పెళ్లైన వాళ్లకు రకరకాల బహుమతులు, సారెలు, స్వీట్లను ఇచ్చి అత్తారింటికి పంపుతుంటారు. అయితే. అత్తారింటికి పంపేటప్పుడు.. కొన్ని  నియమాలు పాటించాలని పండితులు చెబుతున్నారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Nov 29, 2024, 08:38 PM IST
  • పెళ్లిలో వధువు పాటించాల్సిన నియమాలు..
  • పండితులు చెబుతున్న సూచనలు ఇవే..
Wedding Tradition: పెళ్లి కూతురు.. అత్తారింటికి వెళ్లేటప్పుడు మర్చిపోయి కూడా వీటిని తీసుకెళ్లకూడదంట..

wedding tradition culture: సాధారణంగా హిందుసాంప్రదాయంలో అనేక ఆచారాలు, పద్దతులు ఉంటాయి. చాలా మంది తమ ఇంటి ఆచారాలు, సంప్రదాయాలను పెళ్లిల్లో పాటిస్తుంటారు. ఈ క్రమంలో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తొంది. సాధరణంగా పెళ్లి అంటే.. మెయిన్ గా అమ్మాయిల తరపు వాళ్లకు బోలేడు పనులుంటాయని చెబుతుంటారు. పెళ్లి జరిగే వరకు కూడా ఒక రకమైన టెన్షన్ తో ఉంటారు.

అయితే.. పెళ్లిలో అమ్మాయిలు ఇవ్వాల్సిన బంగారు నగలను వాళ్లకు వేస్తుంటారు. అంతే కాకుండా.. పెళ్లిళ్లలో చాలా మంది అమ్మాయిలు అత్తారింటికి వెళ్లేటప్పుడు.. పదకొండు రకాల స్వీట్లు, స్నాక్స్ లు చేయిస్తుంటారు. కొంత మంది బైట ఆర్డర్ లు పెడితే.. మరికొందరు ఇళ్లలోనే చేస్తుంటారు.

మొత్తానికి పదకొండు రకాలు.. ప్రతిదీ పదకొండు ఉండేలా కూడా ప్లాన్ లు చేసుకుంటారు. వీటిని అత్తారింటికి తీసుకెళ్తుంటారు.  కానీ పెళ్లి కూతురు అత్తారింటికి వెళ్లేటప్పుడు.. కొన్ని వస్తువుల్ని పొరపాటున కూడా తీసుకెళ్లకూడదని పండితులు చెబుతుంటారు. అవేంటో ఇప్పుడుచూద్దాం.

ముఖ్యంగా అత్తారింటికి వెళ్లే కొత్త పెళ్లికూతురు.. విలిపీటను తీసుకెళ్లకూడదంట. అదే విధంగా నల్లని వస్తువులు ఏవైన తీసుకెళ్లకూడదని చెప్తుంటారు. చిరిగిపోయిన వస్తువులు, చీరలు మొదలైనవి ఏవి కూడా అస్సలు తీసుకెళ్లకూడదు. అంతేకాకుండా.. కత్తులు తీసుకెళ్లకూడదు. పగిలిపోయిన వస్తువులు, ఏవైన పగుళ్లు ఏర్పడినవి కూడా పొరపాటున తీసుకెళ్లకూడదు.వీటి వల్ల చెడు కలిగే ప్రభావం ఉంటుందని చెబుతుంటారు.

చాలా మంది కొత్తగా పెళ్లైనప్పుడు...మంచాలు, డ్రెస్సింగ్ టెబుల్స్,అద్దాలతో చేసినవి ఇస్తుంటారు. ఇవి జర్నీలో లేదా ట్రాన్స్ పొర్ట్ చేసేటప్పుడు పగుళ్లు ఏర్పడతాయి. అందుకే పగిలిన లేదా గీతలు పడిన వాటిని మర్చిపోయి కూడా తీసుకెళ్లకూడదని పండితులు చెబుతున్నారు. దీనికన్న.. ఏదైన కొనివ్వాలంటే.. అత్తారింటికివెళ్లే ముందు వారిడి డబ్బులు ఇచ్చేస్తే..వారికి నచ్చినవి కొనుక్కొవచ్చని కూడా చెప్తుంటారు.

Read more: Karthika Amavasya: 54 ఏళ్ల తర్వాత అద్భుతం.. రేపు ఈ ఒక్కపనిచేస్తే ఏడాదంత ధనలాభంతో పాటు సొంతింటి కలసాకారం..

అంటే.. వారు వెళ్లబోయే అత్తారింట్లో ఉన్న సదుపాయాలు, ఇంటి వాతావరణం చూసి దానికి తగ్గవిధంగా వస్తువులు కొంటారని కూడా పండితులు చెబుతున్నారు. అందుకే పైన చెప్పిన కొన్నింటిని అస్సలు అత్తారింటికి తీసుకెళ్లకూడదంట.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News