SI Suicide and Constable Murder: తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లో సంచలన ఘటనలు చోటు చేసుకున్నాయి. వాజేడు ఎస్సై ఆత్మహత్యకు పాల్పడగా.. హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ మహిళా కానిస్టేబుల్ దారుణ హత్యకు గురయ్యారు. ఈ రెండు సంఘటనలతో పోలీస్ డిపార్ట్మెంట్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ములుగు జిల్లాలో మావోయిస్టుల ఎన్కౌంటర్ ఆదివారం ఉదయం జరగ్గా.. రాత్రికి ఎస్సై రుద్రారపు హరీష్ తన సర్వీస్ రివాల్వర్‌తో సూసైడ్ చేసుకున్నారు. ఎస్సై ఆత్మహత్య వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఆదివారం రాత్రి తన గర్ల్ ఫ్రెండ్‌తో కలిసి ముళ్లకట్ట సమీపంలోని హరిత రిసార్ట్‌కు వెళ్లారు. అయితే ఇంట్లో తనకు మరో పెళ్లి సంబంధం చూస్తుండడంతో మనస్థాపానికి గురయ్యారు. పెళ్లి వ్యవహారంతోనే మనస్థాపానికి గురై అక్కడే గన్‌తో కాల్చుకుని చనిపోయినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఎస్సై ఆత్మహత్య వ్యహహారం పోలీస్ డిపార్ట్మెంట్లో చర్చనీయాంశంగా మారింది.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. హయత్‌నగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న నాగమణి అనే కానిస్టేబుల్ దారుణం హత్యకు గురయ్యారు. కత్తితో మెడ నరికి చంపేశారు. కులాంతర వివాహమే ఆమె హత్యకు కారణమని అనుమానం వ్యక్తం చేస్తన్నారు. రాయపోలు నుంచి మన్యగుడ రహదారిపై కానిస్టేబుల్‌ను హత్య చేశారు. మృతురాలి స్వస్థలం రాయపోలుగా గుర్తించారు. హయత్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఆమె కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. రాయప్రోలు గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తితో ప్రేమలో ఉన్నారు. నెల రోజుల క్రితమే ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. హత్య గురించి సమాచారం తెలుసుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మాన్ ఆస్పత్రికి తరలించారు.
Also Read: New Ration Cards: ఏపీలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఉందా, క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం
Also Read: Viral Video: ఫుట్ బాల్ మ్యాచ్ స్టేడియంలో ఘోరం.. 100 మందికి పైగా మృతి.. షాకింగ్ వీడియోలు వైరల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.