Maharashtra CM: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్.. షిండేకు ఆ కీలక పదవి..

Maharashtra CM Devendra Fadnavis:  మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి భారీ విజయం సాధించింది. అయితే ముఖ్యమంత్రి పీఠంపై శివసేన అధినేత ఏక్ నాథ్ షిండే పట్టువీడకపోవడం.. మరోవైపు బీజేపీ పెద్దలు మాత్రం ఎక్కువ సీట్లు వచ్చిన తమకే సీఎం పదవి తీసుకుంటామని చెప్పారు. చివరకు అంతా అనుకున్నట్టే మహాయుతి తరుపున దేవేంద్ర ఫడణవీస్ కు మహారాష్ట్ర సీఎం పదవి దగ్గబోతున్నట్టు దాదాపు ఖరారైంది. మరోవైపు షిండేకు కీలక పదవి ఇవ్వడానికి కేంద్ర పెద్దలు ఓకే చెప్పినట్టు సమాచారం.  

Written by - TA Kiran Kumar | Last Updated : Dec 4, 2024, 01:13 PM IST
Maharashtra CM: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్.. షిండేకు ఆ కీలక పదవి..

Maharashtra CM Devendra Fadnavis:  మహారాష్ట్ర రాజకీయం మంచి రసపట్టులో ఉంది. ఎన్నికల ఫలితాలు వెలుబడి దాదాపు రెండు వారాలు కావొస్తోన్న ముఖ్యమంత్రి పీఠంపై ఉన్న పీఠముడి ఇంకా వీడలేదు. ముందుగా ఏక్ నాథ్ షిండే.. ముఖ్యమంత్రి పీఠం కావాలని పట్టుపట్టినా.. కేంద్ర పెద్దలు.. మహారాష్ట్రలో ఇండిపెండెంట్స్ తో పాటు.. కాంగ్రెస్.. శివసేన ఉద్ధవ్ థాక్రే తో పాటు ఎన్సీపీ శరద్ పవార్ కు చెందిన ఎమ్మెల్యేలు చాలా మంది బీజేపీలో జాయిన్ కావడానికి ఉత్సాహాం చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీకి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ దాటిపోతుంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు షిండే అవసరం కూడా బీజేపీకి ఉండదు. మరోవైపు శివసేన ఉద్ధవ్ థాక్రే.. కేంద్ర పెద్దలను దిక్కరించడం మూలానా.. రెంటికి చెడ్డ రేవడి అయ్యారు. ప్రస్తుతం ఆ పార్టీ నుంచి గెలిచిన అభ్యర్ధులు కూడా బీజేపీ వైపు చూస్తున్నారు.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పీఠం కోసం పట్టుబడితే.. మొదటికే మోసం వస్తుందని గ్రహించిన ఏక్ నాథ్ షిండే.. ఆ తర్వాత మెత్తపడ్డట్టు తెలుస్తోంది. ఈయనకు కీలకమైన డిప్యూటీ సీఎంతో పాటు రెవెన్యూ శాఖను కేటాయించనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు హోం, ఆర్ధిక శాఖలను ఎట్టి పరిస్థితుల్లో వేరే వాళ్లకు ఇచ్చేదే లేదని బీజేపీ తెగేసి చెప్పేసింది. మరోవైపు ఎన్సీపీ తరుపున అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఇప్పటికే మహారాష్ట్రలో బీజేపీ శాసనసభాపక్ష నేతగా దేవేంద్ర ఫడణవీస్ ఎన్నిక చేశారు. మరోవైపు మహాయుతి తరుపున మహారాష్ట్ర సీఎంగా ఆయన్ని ప్రకటించారు.  ఈ నేపథ్యంలో కేంద్ర పెద్దలు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ లను కేంద్ర పరిశీలకులుగా పంపించారు.  రేపు సాయంత్రం.. దేవేంద్ర ఫడణవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రమాణ  స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ తో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, జేపీ నడ్డాతో పాటు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్,  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా పలువురు ఎన్డీయే నేతలు హాజరు కానున్నారు.

మహారాష్ట్ర 15వ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని ఎన్డీయే (మహాయుతి) కూటమి హిస్టరీలో ఎన్నడు లేనట్టుగా 231 సీట్లలో విజయ కేతనం ఎగరేసింది. ఈ ఎన్నికల్లో  బీజేపీ 149 సీట్లకు గాను 132 ఎమ్మెల్యే సీట్లు గెలిచి 89 శాతం స్ట్రైక్ రేట్ సాధించింది. మరోవైపు శివసేన షిండే గ్రూపు.. 57 శాసన సభ స్థానాలు..మరోవైపు అజిత్ పవార్ ఎన్సీపీ.. 41 సీట్లలో గెలిచాయి.

ఇదీ చదవండి: ముగ్గురు మొనగాళ్లు సినిమాలో చిరంజీవి డూప్ గా నటించింది వీళ్లా.. ఫ్యూజలు ఎగిరిపోవడం పక్కా..

ఇదీ చదవండి:  టాలీవుడ్ లో ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రాలు.. ‘పుష్ప 2’ ప్లేస్ ఎక్కడంటే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News