Deputy CM Photo on 8 year old boy Aadhar Card: మహారాష్ట్రంలో ఓ బాలుడి ఆధార్ కార్డుపై డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఫొటో ఉంది. ఏడేళ్ల క్రితం జారీ చేసిన ఈ ఆధార్ కార్డుతోనే బాలుడికి అన్ని పనులు జరుగుతున్నాయి. ప్రభుత్వ పథకాలతో పాటు పాఠశాలలో అడ్మిషన్ కూడా లభించింది.
Old Neem Tree Falls in Maharashtra: భారీ వర్షాలకు ఆలయంలోని వృక్షం కూలడంతో ఏడుగురు మృతి చెందారు. నలబై మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటన మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో జరిగింది.
Bandi Sanjay Padayatra: నిర్మల్ జిల్లా ఎస్పీని కలవడానికి వెళుతున్న వాళ్లను కూడా పోలీసులు అడ్డుకుని దారుణంగా కొడుతున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. బీజేపి కార్యకర్తలను భేషరతుగా విడుదల చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
Bandi Sanjay Padayatra in Bhainsa: శాంతియుత పద్ధతిలో పాదయాత్రకు వెళ్తున్న తనను అడ్డుకోవడం ఏంటని ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రభుత్వాన్ని, పోలీసులను ప్రశ్నించారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవీస్ రాకకు ఏర్పాట్లు చేసి యూ టర్న్ తీసుకుంటారా అని పోలీసులను ప్రశ్నించారు.
Shiv Sena: మహారాష్ట్రలో రాజకీయ వేడి తగ్గడం లేదు. శివసేనలో మరింత చీలిక వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఏం చేయాలో తెలియక ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే తల పట్టుకుంటున్నారు.
Amruta Fadnavis on Maha New Govt: మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత ఫడ్నవీస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామాలు తననూ ఆశ్చర్యపరిచాయని చెప్పుకొచ్చారు.
Uddhav Thackeray: మహారాష్ట్రలో పాలిటిక్స్ హీట్ మీద ఉన్నాయి. శివసేన రెబెల్స్, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అప్పటి నుంచి అధికార,విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే హాట్ కామెంట్స్ చేశారు.
Sharad Pawar: మహారాష్ట్ర పొలిటికల్ కథా చిత్రమ్ ముగిసింది. అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో సీఎం ఏక్నాథ్ షిండే నెగ్గారు. విశ్వాస పరీక్షల్లో అత్యధిక ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు.
Eknath Shinde: మహారాష్ట్రలో అనేక నాటకీయ పరిణామాల మధ్య శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది. ఇక బలపరీక్ష ఎదుర్కోవాల్సి ఉంది.
eknath shinde: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే కొత్త సీఎం కానున్నారు. ఈ విషయాన్ని బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు.
Devendra Fadnavis: మహారాష్ట్రలో అంతా అనుకున్నట్లే జరిగింది. మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. కాసేపట్లో ఈకార్యక్రమం జరగనుందని బీజేపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
Uddhav Thackeray Resigned: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. రేపు గురువారం మహారాష్ట్ర అసెంబ్లీలో బల పరీక్షపై స్టే కోరుతూ ఉద్ధవ్ థాకరే సర్కారు దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకోకతప్పలేదు.
Maharashtra crisis: మహారాష్ట్రలో అధికారంలో ఉన్న సంకీర్ణ సర్కార్ సంక్షోభంలో పడింది.మహారాష్ట్ర పరిణామాలతో బీజేపీ తీరుపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. 2014లో బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 9 రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చివేసింది
Sameer Wankhede wore ₹70,000 shirt Maharashtra Minister Nawab Malik:సమీర్‌పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు మంత్రి నవాబ్ మాలిక్. డ్రగ్స్ కేసు (Drugs case) వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై మంత్రి నవాబ్ మాలిక్ విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. సమీర్ వాంఖడే కోట్లకు పడగలెత్తారని, నిజాయతీ పరుడైన అధికారికి సాధ్యంకాని రీతిలో ఖరీదైన వస్తువుల్ని వాడుతున్నారంటూ తాజాగా మంత్రి నవాబ్ మాలిక్ ఆరోపించారు.
మహారాష్ట్ర మహా వికాస్ అగాఢి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) పాటు ఆయన కుటుంబానికి భద్రతను తగ్గించింది.
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, శివ సేన పార్టీ ఎంపీ, కీలక నేత అయిన సంజయ్ రౌత్ ( Devendra Fadnavis, Sanjay Raut meeting ) శనివారం ముంబైలోని ఓ లగ్జరీ హోటల్లో వీళ్లిద్దరూ సమావేశం కావడం రాజకీయవర్గాల్లో చర్చనియాంశమైంది. బీజేపి అంటేనే ఒంటికాలుపై లేస్తున్న శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ( Shiv Sena MP Sanjay Raut ) ఇలా బీజేపి కీలక నేతతో రహస్య మంతనాలు ఏంటా అని అందరూ ఆశ్చర్యపోయారు.
హిందూత్వ భావజాలం వైపు అడుగులు వేస్తున్న మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే కాషాయపు రంగు జెండాను తన పార్టీ కొత్త జెండాగా ఆవిష్కరించారు. రాజ్ ఠాక్రే కుమారుడు అమిత్ ఠాక్రే రాజకీయ ప్రవేశం చేశారు. ఆవిష్కరించిన కొత్త జెండా ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క రాజ ముద్ర, దాని క్రింద పార్టీ పేరు ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.