AP Rains: బంగాళాఖాతంలో బలపడిన అల్ప పీడనం.. ఆ ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవులు..

AP Rains: ఏపీని వరుణ దేవుడు వీడటం లేదు. మరోసారి అక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. ప్రస్తుతం  శ్రీలంక తీరంలో నైరుతి బంగాళాఖాతంలో అది కొనసాగుతోంది.

1 /6

AP Rains: బే ఆఫ్ బెంగాల్ లో ఏర్పడిన అల్పపీడనం వల్ల దానికి  అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అది వచ్చే 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా శ్రీలంక-తమిళనాడు తీరాల వైపు కదులుతుందని తెలిపింది.

2 /6

దీని ప్రభావంతో  ఈ రోజు చిత్తూరు, కర్నూలు, నంద్యాల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అనంతపురం, శ్రీ సత్య సాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలియజేసింది. ఆయా ప్రాంతాల్లో పరిస్థితులను బట్టి స్కూళ్లకు సెలవులు ప్రకటించే అధికారం కలెక్టర్స్ కు అప్పగించింది ప్రభుత్వం.

3 /6

రాష్ట్రంపై  అల్పపీడన ప్రభావం ఉన్నా, చలి తీవ్రత కనిపిస్తోంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఉదయం తొమ్మిది గంటల వరకు పాడేరు, పరిసర ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా కమ్ముకుంది.

4 /6

ఉదయం 9 గంటలు దాటిన తరువాతే  ఏజెన్సీ వాసులు బయటకు వస్తున్నారు. పొగమంచు ఎక్కువగా వుండటంతో ప్రభావానికి ఎదురుగా ఉన్న వ్యక్తులు సైతం కనిపించని పరిస్థితి ఏర్పడింది. మంచు దెబ్బకు వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు.

5 /6

అల్పపీడనప్రభావంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. కోతలు కోసిన రైతులు పంట ఏమవుతుందోనన్న ఆందోళనలో ఉన్నారు. గత నెల చివరిలో ఫెయింజల్‌ తుఫాన్ ప్రభావంతో ఈదురు గాలులు వర్షాలకు వేల ఎకరాల్లో కోతకు వచ్చిన పంట నేలవాలింది.

6 /6

అంతలోనే మరో అల్పపీడనం ఏర్పడటంతో అన్నదాతలను ఆందోళన చెందుతున్నారు. దీని ప్రభావంతో   మళ్లీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించడంతో రైతులు తమ పంటను కాపాడుకునే పనిలో పడ్డారు.