హైదరాబాద్: ఆన్లైన్ షాపింగ్, ఆన్లైన్ వ్యాపారానికి సంబంధించి లావాదేవీలను పటిష్టం చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. డిజిటల్ చెల్లింపు వ్యవస్థను మరింత సురక్షితంగా చేయడానికి OTPతో పాటు ఫేషియల్ ఐరిస్ ను పాస్‌వర్డ్‌గా ఉపయోగించనున్నట్టు పేర్కొంది. పెరుగుతున్న ఆన్లైన్ మోసాల దృష్ట్యా ప్రభుత్వం ఈ చర్య తీసుకుందని, ప్రభుత్వం త్వరలో ఈ నిర్ణయాన్ని అమలు చేస్తుందని, వీటిని ఉపయోగించడం ద్వారా మోసాల నుండి త్వరితగతిన తప్పించుకోగలుగుతారని పేర్కొంది.
డిజిటల్ లావాదేవీల కోసం మల్టీ-ఫాక్టర్ ప్రామాణీకరణను అమలు చేయాలని భారత ప్రభుత్వం ప్రతిపాదించిందని, ఇందులో ఫేషియల్ రికగ్నిషన్, ఐరిస్ స్కాన్ లొకేషన్ వంటివి ఉంటాయని తెలిపింది.
బిజినెస్ ఇన్సైడర్ ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, గడిచిన కొన్నేళ్లలో 1.3 బిలియన్ యుపిఐ లావాదేవీలు నమోదు చేయబడ్డాయని, రోజురోజుకు పెరుగుతున్న ఈ ఆన్లైన్ వ్యాపారాలను భద్రపరచడం ఇప్పుడు అత్యవసరమని పేర్కొంది. డిజిటల్ లావాదేవీలను సురక్షితంగా జరపడానికి ఈ ఉపకరణాలు జోడించడం ఆవశ్యకమని పేర్కొంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..