7th Pay Commission Salary DA Hike in Telugu: 7వ వేతన సంఘం ప్రకారం ప్రతి ఏటా ఉద్యోగుల జీతభత్యాలు పెరుగుతుంటాయి. గత ఏడాది అంటే జూలై నుంచి డిసెంబర్ వరకు ఉన్న ఏఐసీపీఐ ఇండెక్స్ ఆధారంగా జనవరి డీఏ పెంపు ఎంతనేది నిర్ణయిస్తుంటారు. జనవరి నుంచి జూన్ వరకూ ఉన్న ఇండెక్స్ ఆధారంగా జూలై డీఏ పెంపు ఉంటుంది.
7th Pay Commission Salary DA Hike in Telugu: వచ్చే ఏడాది అంటే మరో నెలలో జనవరి నెల డీఏ పెంపు కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనరా్లు ఎదురుచూస్తున్నారు. జనవరి 2025లో డీఏ 3 శాతం ఉండవచ్చని అంచనా. అంటే కనీస వేతనం 18 వేలలో 3 శాతమంటే నెలకు జీతం 540 రూపాయలు పెరుగుతుంది. ఉద్యోగుల గరిష్ట జీతం 2.5 లక్షలుంటే 3 శాతం చొప్పున 7500 రూపాయలు పెరగనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మరి కొద్దిరోజుల్లో డిసెంబర్ నెల ముగియనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గ్రాట్యుటీ చట్టం, పెన్షనర్ల గ్రాట్యుటీ రిలీఫ్ జనవరి 2025 మారనుంది. ఇప్పటి వరకు ఉన్న అంచనాల ప్రకారం జనవరిలో డీఏ ఎంత పెరుగుతుంది, జీతం ఎంత పెరుగుతుందనేది తెలుసుకుందాం.
7వ వేతన సంఘం ప్రకారం కేంద్ర ప్రభుత్వం డియర్నెస్ అలవెన్స్, డియర్నెస్ రిలీఫ్ ఏడాదికి రెండు సార్లు పెరుగుతుంది. జూలై నుంచి డిసెంబర్ ఏఐసీపీఐ ఇండెక్స్ ప్రకారం జనవరిలో..జనవరి నుంచి జూన్ ఇండెక్స్ ప్రకారం జూలైలో పెరుగుతుంది. ఈ లెక్కన జనవరిలో ఎంత పెరగనుందనే అంచనాలు ప్రారంభమయ్యాయి.
డీఏ పెరగాల్సింది జనవరి లేదా జూలైలో అయినా ప్రారంభమయ్యేది మార్చ్ , సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో ఉంటుంది. జనవరి డీఏ పెంపు ప్రకటన ఎరియర్లతో కలిపి మార్చ్ నెలలోనూ, జూలై పెంపు ప్రకటన సెప్టెంబర్- అక్టోబర్ నెలల్లో ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ, డీఆర్ పెంపుకు సంబంధించిన జూలై నుంచి డిసెంబర్ వరకూ ఏఐసీపీఐ ఇండెక్స్ ఆధారంగా లెక్కిస్తారు. ఇప్పటికే జూలై నుంచి అక్టోబర్ వరకు ఏఐసీపీఐ డేటా అందుబాటులో ఉంది. నవంబర్, డిసెంబర్ డేటా వచ్చాక డీఏపై నిర్ణయం ఉంటుంది.
డిసెంబర్ 2024 ఏఐసీపీఐ సూచీ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అంచనా వేస్తారు. అందుకే ప్రతి ఏటా జనవరి డీఏ పెంపు ప్రకటన మార్చ్ నెలలో ఉంటుంది.
2024 జనవరిలో డీఏ 4 శాతం పెరగడంతో 50 శాతానికి చేరుకుంది. జూలైలో 3 శాతం పెరగడంతో 53 శాతమైంది. అటు పెన్షనర్లకు ఇచ్చే డీఆర్ కూడా 53 శాతానికి చేరుకుంది.
అక్టోబర్ వరకూ ఉన్న ఏఐసీపీఐ ఇండెక్స్ నవంబర్, డిసెంబర్ నెలల అంచనాను బట్టి జనవరి 2024 డీఏ 3 శాతం పెరగవచ్చని భావిస్తున్నారు. అదే జరిగితే మొత్తం డీఏ 56 శాతానికి చేరనుంది.
జనవరి నెలలో డీఏ 3 శాతం పెరిగింతే కనీస వేతనం 18 వేలున్న ఉద్యోగులకు జీతం 540 రూపాయలు పెరుగుతుంది. అదే గరిష్ట జీతం 2.5 లక్షలుంటే 3 శాతం డీఏ చొప్పున 7500 రూపాయలు పెరగనుంది.
ఇక పెన్షనర్ల అంశాన్ని పరిశీలిస్తే కనీస పెన్షన్ 9 వేలున్నవారికి డీఆర్ 3 శాతం చొప్పున 270 రూపాయలు పెరగనుంది. గరిష్టంగా 1 లక్షా 25 వేలున్నవారికి 3 శాతం చొప్పున 3,750 రూపాయలు పెరగనుంది.