BSNL Fiber Plan: దేశంలోని ప్రైవేట్ టెలీకం కంపెనీలు రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియాలు పోటాపోటీ ఆఫర్లతో బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఈ మూడు కంపెనీల కంటే అత్యంత చౌక ధరకు బీఎస్ఎన్ఎల్ అద్భుతమైన ఆఫర్లు ఇస్తోంది. కేవలం 449 రూపాయలకే 3300 జీబీ డేటా ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపర్చింది. ఈ ఆఫర్ వివరాలు ఇలా ఉన్నాయి.
ఇటీవలి కాలంలో ఇంటర్నెట్ డేటా అనేది ఓ అవసరంగా మారిపోతోంది. నెట్ లేకుండా ఏ పనీ చేయలేని పరిస్థితి నెలకొంది. విద్యార్ధుల నుంచి ఉద్యోగుల వరకూ అందరికీ ఇదే పరిస్థితి. ఇక ఓటీటీ వంటి ఎంటర్‌టైన్‌మెంట్ అందుబాటులో వచ్చాక డేటా అవసరం మరింతగా పెరిగింది. స్మార్ట్‌ఫోన్ల వినియోగంతో డేటా వినియోగం పీక్స్‌కు చేరింది. ఈ క్రమంగా ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ అద్భుతమైన డేటా ప్లాన్ అందిస్తోంది. ఈ ప్లాన్ తీసుకుంటే డేటా అన్‌లిమిటెడ్ ఉంటుంది. అంటే ఎంత వాడినా డేటా తరగదు. బీఎస్ఎన్ఎల్ ఫైబర్ బేసిక్ నియో ప్లాన్ ఇది. ఈ ప్లాన్ టారిఫ్ కేవలం 449 రూపాయలు మాత్రమే.
బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఫైబర్ బేసిక్ నియో ప్లాన్‌లో డేటా ఏకంగా 3.3 టీబీ లభిస్తుంది. అంటే 33 వందల జీబీ డేటా అందుబాటులో ఉంటుంది. డేటా స్పీడ్ 30 ఎంబీపీఎస్ ఉంటుంది. అంటే రోజుకు 100 కంటే ఎక్కువ జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్‌తో కేవలం డేటా ఒక్కటే కాకుండా అన్‌లిమిటెడ్ కాలింగ్ కూడా ఉంటుంది. అయితే ఈ ప్లాన్ బీఎస్ఎన్ఎల్ కొత్త కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది. ప్రస్తుతం ప్రమోషన్ పీరియడ్‌లో భాగంగా ఈ ప్లాన్ 449 రూపాయలకు లభిస్తోంది. ప్రమోషన్ పూర్తయ్యాక 599 రూపాయల ప్లాన్‌కు మారాల్సి ఉంటుంది. ఈ ప్లాన్‌తో స్పీడ్ 60 ఎంబీపీఎస్‌కు పెరుగుతుంది.
Also read: Salary DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కళ్లు చెదిరే గుడ్‌న్యూస్, భారీగా పెరగనున్న జీతం, డీఏ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.