Allu Arjun VS Revanth Reddy: అల్లు అర్జున్‌కు మరో బిగ్ షాక్.. వారిపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. ఎందుకో తెలుసా..?

Pushpa 2 stampede controversy: పుష్ప2 మూవీ ప్రీమియర్ షో నేపథ్యంలో సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో దిల్ సుఖ్ నగర్ కు చెందిన రేవతి అనే మహిళ చనిపోయిన విషయం తెలిసిందే.  

Written by - Inamdar Paresh | Last Updated : Dec 18, 2024, 10:44 AM IST
  • అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు మరో షాక్..
  • కేసులు నమోదు చేసిన పోలీసులు..
Allu Arjun VS Revanth Reddy: అల్లు అర్జున్‌కు మరో బిగ్ షాక్.. వారిపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. ఎందుకో తెలుసా..?

Pushpa 2 controversy cases against social media posts: పుష్ప2 మూవీ ప్రస్తుతం వివాదాలకు కేరాఫ్ గా మారిందని చెప్పుకొవచ్చు. ఈ నేపథ్యంలో.. ఇటీవల దీనిపై పోలీసులు సీరియస్ గా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తొంది. అదే విధంగా రేవంత్ రెడ్డి సైతం ఈ ఘటనపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఇటీవల అల్లు అర్జున్ అరెస్ట్  తర్వాత అనేక మంది సోషల్ మీడియాలో సీఎం రేవంత్ రెడ్డిపై అనుచితంగా పోస్టులు పెట్టినట్లు తెలుస్తొంది. సీఎం రేవంత్ పేరును .. అల్లు అర్జున్ మర్చిపోవడం వల్ల.. ఆయన ఇదంతా వెనకుండి నాటకం నడిపిస్తున్నాడని కూడా వార్తలు తెగ వైరల్ అయ్యాయి.

దీనిపై బీఆర్ఎస్ నేతలు కూడా గట్టిగానే కౌంటర్ లు ఇచ్చారు. ఇటీవల కేటీఆర్ కూడా మాట్లాడుతూ.. చిట్టినాయుడు ఈగో హర్ట్ కావడం వల్ల అరెస్ట్ చేయించాడని కూడా వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ప్రస్తుతం తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ బాలుడు శ్రీతేజ్ మాత్రం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తొంది. అతడ్ని ఇటీవల సీపీ సీవీ ఆనంద్ పరామర్శించారు. బాలుడి ఆరోగ్యం సీరియస్ గా ఉందని, బ్రెయిన్ దగ్గర చాలా డ్యామెజ్ అయ్యిందని.. ఆహారంను పైపుల ద్వారా అందిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా శ్రీతేజ్ ఆస్పత్రి ఖర్చులు.. రేవంత్ సర్కారు భరిస్తుందని కూడా సీపీ సీవీ ఆనంద్  క్లారిటీ ఇచ్చారు.

మరొవైపు అల్లుఅర్జున్ అరెస్ట్, కోర్టు మధ్యంతర బెయిల్ వంటి అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై కొంత మంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాంట్రవర్సీగా, రేవంత్ కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టినట్లు తెలుస్తొంది. ప్రస్తుతం పోలీసులు సీఎం రేవంత్ కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వారిపై చర్యలకు దిగినట్లు తెలుస్తొంది. దీనిలో భాగంగా.. పోలీసులు పలువురు అభిమానులు పెట్టిన కాంట్రవర్సీ పోస్టులపై.. 4 కేసులు నమోదు చేసినట్లు తెలుస్తొంది.

Read more: Allu Arjun: శ్రీతేజ్ ఆస్పత్రి ఖర్చులపై షాకింగ్ నిజం బైటపెట్టిన సీవీ ఆనంద్.. అల్లు అర్జున్ చెప్పినవన్ని అబద్దాలేనా..?.. వీడియో వైరల్..

అంతే కాకుండా.. తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి పై అభ్యంతరకరంగా, ఇష్టమోచ్చినట్లు అనుచితంగా పోస్టులు పెట్టిన వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం. మరొవైపు బాలుడి వైద్య ఖర్చులు అల్లు అర్జున్ టీమ్ భరిస్తుందని గతంలో చెప్పడం జరిగింది. కానీ రేవంత్ సర్కారు భరిస్తుందని .. ఏకంగా సీసీ సీవీ ఆనంద్ చెప్పడంతో మాత్రం పెనుదుమారం చెలరేగిందని తెలుస్తొంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News