Tollywood: ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీతో పాటు దక్షిణాదికి చెందిన అన్ని సినిమా పరిశ్రమలు చెన్నై కేంద్రంగా పనిచేశాయి. 70వ దశకంతో తెలుగు చిత్ర పరిశ్రమ మెల్ల మెల్లగా చెన్నై నుంచి హైదరాబాద్ కు రావడం ప్రారంభమైంది. ఇక 90వ దశకం వచ్చే వరకు తెలుగు చిత్ర పరిశ్రమ పూర్తి స్థాయిలో హైదరాబాద్ లో సెటిలైంది. అయితే కొంత మంది సీనియర్ నటులు..టెక్నిషియన్స్ మాత్రం చెన్నైలోనే ఉండిపోయారు. అప్పట్లో సినిమా నటులు కావాలనుకునే వారు ఏపీలో సర్కారు ఎక్స్ ప్రెస్ ఎక్కి అప్పటి మద్రాసు ఇప్పటి చెన్నైలో వాలిపోయేవారు. అక్కడ పాండీబజార్ లో తమ లక్ ను పరీక్షించుకునే వారు.
ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమ తెలుగు రాష్ట్రాలను దాటి ప్యాన్ ఇండియా కాదు..ప్యాన్ వరల్డ్ రేంజ్ ఎదిగింది. అంతేకాదు హైదరాబాద్ లోనే పలు బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాల షూటింగ్ జరుపుకునే స్థాయికి ఎదిగింది. అలాంటి చిత్ర పరిశ్రమ తాజాగా తెలంగాణ ప్రభుత్వంతో ఏర్పడిన కొన్ని ఇష్యూస్ వల్ల ఏపీకి తరలించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
కానీ ప్రాక్టికల్ గా అది పాజిబుల్ కాదనే చెప్పాలి. తాజాగా పుష్ప 2 విడుదల సందర్బంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో అల్లు అర్జున్ వ్యవహరించిన తీరుపై ప్రభుత్వం కన్నెర్ర చేసింది. తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు.. ఈ ఘటనలో ప్రభుత్వ వైఫల్యంతో పాటు అల్లు అర్జున్ తప్పు కూడా ఉంది. ముఖ్యంగా అల్లు అర్జున్ అహం గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తీసుకొచ్చినట్టు సమాచారం. అయితే.. శనివారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ మానవత్వం మరిచి వ్యవహరించారని బన్ని తీరును తూర్పారా బట్టారు. మరోవైపు దీనికి కౌంటర్ గా అల్లు అర్జున్ అప్పటి ప్రెస్ మీట్ పెట్టడం అగ్ని ఆజ్యం పోసినట్టైయింది. బన్ని ప్రెస్ మీట్ లో చెప్పిన విషయాల్లో కొన్ని తప్పు అని పోలీసులు ఆధారాలతో సహా బయటపెట్టడంతో అల్లు అర్జున్ టీమ్ కు నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. షరతులతో కూడిన బెయిల్ పై ఉన్న అల్లు అర్జున్ .. ప్రెస్ మీట్ పెట్డడంపై పోలీసులు గుర్రుగా ఉన్నారు. అతని బెయిల్ ఎందుకు క్యాన్సిల్ చేయకూడదని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. తాజాగా ఈ వ్యవహారం నేపథ్యంలో సినీ ఇండస్ట్రీని ఏపీ తరలించబోతున్నారంటూ వస్తున్న వార్తలపై నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు.
ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలుద్దామని ఎవరూ చెప్పలేదన్నారు సినీ నిర్మాత నాగవంశీ. తాను డబ్బు పెట్టి ఇక్కడ ఇల్లు కట్టుకున్నానన్నారు. ఆంధ్ర ప్రదేశ్ కు వెళ్లి ఏం చేయాలి అన్నారు. పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి ఏపీ ప్రభుత్వం నుంచి సపోర్ట్ చేస్తామని తమతో ఫస్ట్ మీటింగ్‌లోనే చెప్పారన్నారు. ఆ సపోర్ట్ అలాగే ఉంటుందని భావిస్తున్నామన్నారు నిర్మాత నాగవంశీ. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్ నుంచి తరలి వెళుతుందనే వార్తల్లో నిజం లేదని రూఢీ అయింది.
ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..
ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.