Ticket Rates in Telangana: సామాన్యులకు అందుబాటులో సినిమాలు.. తెలంగాణ ఎగ్జిబిట‌ర్స్ అసోసియేష‌న్ కీలక వ్యాఖ్యలు

Ticket Rates in Telangana: తెలంగాణ రాష్ట్రంలో.. టికెట్ రేట్స్ గురించి గవర్నమెంట్ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సినిమా టికెట్ రేట్లు నియంత్రణలో ఉంచుతాము అంతు ప్రకటించారు. ఈ క్రమంలో సినిమా టికెట్స్ రేట్స్ ని పెంచకుండా.. నియంత్రణలో ఉంచుతాము అని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని.. తాము స్వాగతిస్తాము అంటూ తెలియజేశాడు తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Dec 24, 2024, 07:34 AM IST
Ticket Rates in Telangana: సామాన్యులకు అందుబాటులో సినిమాలు.. తెలంగాణ ఎగ్జిబిట‌ర్స్ అసోసియేష‌న్ కీలక వ్యాఖ్యలు

Movie Ticket Rates in Telengana: తెలంగాణ రాష్ట్రంలో సినిమా టికెట్ రేట్స్‌ను పెంచ‌కుండా నియంత్రణలో ఉంచుతాము అని.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని చిత్ర పరిశ్రమలోని అనేక మంది స్వాగతించారు. ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి ఇటీవల ఈ నిర్ణయాన్ని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, సోమవారం తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాల‌యంలో.. తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సమావేశం నిర్వహించింది.  

తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ చైర్మన్ విజేందర్ రెడ్డి మాట్లాడుతూ, "టికెట్ రేట్స్ పెంపు వల్ల ప్రేక్షకులపై ఆర్థిక భారం పడుతుంది. ప్రత్యేకంగా మధ్యతరగతి, విద్యార్థులు, రోజువారీ కార్మికులు.. మొదటి కొన్ని రోజుల్లో సినిమా చూసేందుకు ఇష్టపడుతుంటారు. అయితే, అధిక ధరల కారణంగా వారి సామర్థ్యానికి మించి చెల్లించాల్సి వస్తుంది," అని చెప్పారు.  

అలాగే, "టికెట్ ధరలను స్థిరంగా ఉంచడం ద్వారా థియేటర్లకు తగిన ఆదాయం లభిస్తుందని, ప్రేక్షకుల సంఖ్య కూడా పెరుగుతుందని మేం విశ్వసిస్తున్నాం. ముఖ్య‌మంత్రిగారి నిర్ణయానికి మా సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం," అని అన్నారు.  

ఆంధ్రప్రదేశ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సెక్టార్ చైర్మన్ టి.ఎస్. రామ్ ప్రసాద్ మాట్లాడుతూ, "తెలంగాణలో తీసుకున్న ఈ నిర్ణయం తెలుగు చిత్ర పరిశ్రమకు కొత్త ఊపును అందిస్తుందని భావిస్తున్నాం. టికెట్ రేట్లు పెంచకూడదనే నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్‌లో కూడా అమలు చేయాలని కోరుతున్నాం," అని తెలిపారు.  

తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సెక్రటరీ బాల గోవింద్ రాజ్ మాట్లాడుతూ, "గత కొన్ని సంవత్సరాలుగా టికెట్ ధరల పెంపు వల్ల ప్రేక్షకులు గందరగోళానికి గురవుతున్నారు. ఎక్కువ ధరల కారణంగా సాధారణ ప్రజలు థియేటర్లకు రాలేకపోతున్నారు. టికెట్ ధరలను స్థిరంగా ఉంచడం ద్వారా ఈ సమస్యలను నివారించవచ్చు," అని అభిప్రాయపడ్డారు.  

చర్చలో పాల్గొన్న వారందరూ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ, టికెట్ ధరలపై నిర్ధిష్టమైన మార్గదర్శకాలు అవసరమని, భవిష్యత్తులో ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.  

ఈ నిర్ణయం వల్ల ప్రేక్షకుల సంఖ్య పెరిగి, మధ్యతరగతి కుటుంబాలు సైతం సినిమా అనుభవాన్ని ఆస్వాదించగలవని భావిస్తున్నామని తెలియజేశారు. నిర్మాతలు కూడా సాధారణ ప్రేక్షకులకు అందుబాటులో ఉండేలా చిత్రాలను విడుదల చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.

Also Read: YS Jagan Sharmila: బర్త్ డేకు విష్ చేయని షర్మిల! వైఎస్‌ జగనన్న అంటే అంత కోపమా?

Also Read: YS Sharmila: న్యూ ఈయర్‌కు ఏపీలో మహిళలకు ఉచిత బస్సు.. వైఎస్‌ షర్మిల ప్రశ్నలు ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook

Trending News