మెల్బోర్న్: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతోన్న మహిళల ట్వంటీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగిస్తోంది. లీగ్ దశను అజేయంగా ముగించింది. గ్రూప్-ఏలో ఉన్న భారత మహిళల జట్టు వరుసగా తమ చివరి మ్యాచ్‌లోనూ భారీ విజయాన్ని అందుకుంది. శనివారం నాడు జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక జట్టుపై 7 వికెట్ల తేడాతో విజయదుందుభి మోగించింది. భారత చిన్నది షఫాలీ వర్మ బ్యాటింగ్‌లో మరోసారి చెలరేగింది. షఫాలీ బ్యాటింగ్‌కు లంక బౌలర్ల వద్ద సమాధానం లేకుండా పోయింది.
See Photos: బాత్‌టబ్‌లో నటి హాట్ ఫొటోషూట్!
ఫస్ట్ బ్యాటింగ్ చేసిన శ్రీలంక మహిళల జట్టు 9 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. చమిరా ఆటపట్టు(33), కవిషా దిల్హరి(25)లు మాత్రమే ఓ మోస్తరుగా ఆడటంతో లంక స్వల్పస్కోరుకే పరిమితమైంది. భారత బౌలర్లలో స్పిన్నర్ రాధా యాదవ్ 4 వికెట్లతో రాణించింది. రాజేశ్వరి గైక్వాడ్ 2 వికెట్లు తీయగా, దీప్తి శర్మ, శిఖా పాండే, పూనం యాదవ్‌లకు తలో వికెట్ దక్కింది. 114 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు షఫాలీ వర్మ (47; 34 బంతుల్లో 7ఫోర్లు, 1 సిక్స్) మరో భారీ ఇన్నింగ్స్‌ను అందించింది.
See Photos: అక్కాచెల్లెళ్లు కాదు.. తల్లీకూతుళ్లు!
🇮🇳 finish on 🔝 of group A
🇳🇿 and 🇦🇺 will face-off for the other semifinal spothttps://t.co/OKw2VVgp5Y #T20WorldCup pic.twitter.com/FoUZ3k3Qm5
— ESPNcricinfo (@ESPNcricinfo) February 29, 2020
మరో ఓపెనర్ స్మృతీ మంధాన(17) త్వరగానే ఓటైనా షఫాలీ మాత్రం బౌండరీలతో లంక బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. అనవసర పరుగుకు ప్రయత్నించి రనౌట్ రూపంలో వెనుదిరిగింది. మూడు పరుగులతో హాఫ్ సెంచరీని చేజార్చుకుంది. భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(15) విఫలమైంది. దీప్తి శర్మ (15 నాటౌట్), రోడ్రిగ్స్ (15 నాటౌట్) భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. భారత్ కేవలం 3 వికెట్లు కోల్పోయి 14.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. లీగ్ దశలో అన్ని మ్యాచ్‌ల్లో నెగ్గిన భారత్.. ప్రత్యర్థులకు తామెంత ప్రమాదకర జట్టో మరోసారి నిరూపించింది.
Also Read: పుట్టింది ఫిబ్రవరి 29న.. మరి బర్త్ డేల సంగతేంటి?