DA Salary Hike in Telugu: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు బంపర్ న్యూస్. 7వ వేతన సంఘం ప్రకారం జీత భత్యాలు భారీగా పెరగనున్నాయి. జనవరి డీఏ పెంపు జీతభత్యాలపై ప్రభావం చూపించనుంది. కొత్త ఏడాదిలో ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ఇచ్చే న్యూస్ ఇది. జనవరి నుంచి జీతం, డీఏ ఏ మేరకు పెరగనుందో తెలుసుకుందాం..
DA Salary Hike in Telugu: 7వ వేతన సంఘం సిఫార్సులకు అనుగుణంగా జనవరి నుంచి అంటే మరో వారం రోజుల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతం , డీఏ పెరగనుంది. ఏఐసీపీఐ ఇండెక్స్ జూలై నుంచి అక్టోబర్ సూచీ పరిగణలో తీసుకుంటే నవంబర్ నెలలో 145, డిసెంబర్ నెలలో 145.3 ఉంటుందని అంచనా. అంటే డీఏ రేటు 56.18 శాతానికి పెరగవచ్చు. దీన్ని బట్టి చూస్తే జనవరి 2025లో డీఏ మరో 3 శాతం పెరుగుతుందని అంచనా.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి మేజర్ గుడ్న్యూస్ అందనుంది. 7వ వేతన సంఘం ప్రకారం మరోసారి డీఏ పెరగనుంది. ఏఐసీపీఐ ఇండెక్స్ సూచీ ఆధారంగా ఈ డీఏ అనేది ఈసారి 3 శాతం , డీఆర్ 3 శాతం ఉండవచ్చని తెలుస్తోంది.
రోజురోజుకూ పెరుగుతున్న జీవన ప్రమాణాలు, వ్యయం ప్రభావం కోట్లాదిమంది ఉద్యోగులు, పెన్షనర్లపై ప్రభావం చూపించనుంది. అందుకే ప్రతి యేటా రెండు సార్లు డీఏ పెంచుతుంటుంది ప్రభుత్వం.
డీఏ ఎంతనేది నిర్ణయించేందుకు కేంద్ర కార్మిక శాఖ విడుదల చేసే ఏఐసీపీఐ సూచీ కీలకం. జనవరి నుంచి జూన్ వరకూ ఉన్న డేటాను బట్టి జూలై డీఏ పెంపు, జూలై నుంచి డిసెంబర్ డేటా ఆధారంగా జనవరి డీఏ పెంపు ఉంటుంది.
జూలై నెల ఏఐసీపీఐ ఇండెక్స్ 142.7 శాతముండగా ఆగస్టులో 142.6 ఉంది. డీఏ రేషియో మాత్రం 53.95 ఉంది. ఇక సెప్టెంబర్ డీఏ రేషియో 54.49 శాతముంది. అక్టోబర్ నెల డీఏ నిష్పత్తి 55.05 శాతంగా ఉంది. వీటి ఆధారంగా నవంబర్ నెల డీఏ రేషియో 55.59 శాతం ఉంటుందని, డిసెంబర్ డీఏ రేషియో 56.18 శాతం ఉంటుందని అంచనా.. అంటే జనవరి నెల నుంచి డియర్నెస్ అలవెన్స్ 3 శాతం పెరగవచ్చు.
జూలై 2024 డీఏ కూడా 3 శాతం పెరగడంతో మొత్తం డీఏ 53 శాతమైంది. జనవరి నుంచి మరో 3 శాతం పెరిగి మొత్తం డీఏ 56 శాతం కావచ్చని అంచనా. జనవరి నుంచి డీఏ పెరిగినా మార్చ్ నుంచి అమల్లో రానుంది. మొత్తం కోటిమంది ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది.
డీఏ పెంపు అనేది జీతంపై ప్రభావం చూపించనుంది. అంటే జీతం కూడా పెరుగుతుంది. జనవరి 2025 నుంచి డీఏ 56 శాతానికి చేరితే నెలకు 540 రూపాయలు లేదా ఏడాదికి 6,480 రూపాయలు పెరుగుతుంది. ఇది 18 వేలు కనీస వేతనం ఉన్నవారికి. గరిష్టంగా 2.50 లక్షలు జీతమున్నవారికి నెలకు 7,500 పెరగనుంది.
ఇక కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల కనీస పెన్షన్ 9 వేలుంటే నెలకు 270 రూపాయలు, 1,25 లక్షలుంటే 3,750 రూపాయలు పెరగనుంది.