FD Interest Rate: ఎఫ్‌డిపై అత్యధిక వడ్డీ ఇచ్చే 5 బ్యాంకులివే

FD Interest Rate: రిస్క్ లేకుండా అత్యధిక రిటర్న్స్ ఇచ్చే పథకాల కోసం చాలామంది చూస్తుంటారు. అందుకే రిటైర్ అయిన ఉద్యోగులు ఎక్కువగా ఫిక్స్డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. అయితే ఎఫ్‌డీలపై ఒక్కో బ్యాంకు ఒక్కో రకమైన వడ్డీ చెల్లిస్తుంటుంది. ఏ బ్యాంకు ఎక్కువ వడ్డీ ఆఫర్ చేస్తుందో తెలుసుకోవాలి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 8, 2025, 08:26 PM IST
FD Interest Rate: ఎఫ్‌డిపై అత్యధిక వడ్డీ ఇచ్చే 5 బ్యాంకులివే

FD Interest Rate: ఎఫ్‌డి అనగానే అందరూ ముందుగా అడిగేది వడ్డీ ఎంత అని. ఎందుకంటే వడ్డీతోనే ఇన్వెస్ట్ చేసిన ఆదాయం పెరుగుతుంది. రిటర్న్స్ ఎక్కువగా ఉంటాయి. ఎఫ్‌డీలపై వడ్డీ విషయంలో జాతీయ, అంతర్జాతీయ బ్యాంకుల కంటే చిన్న బ్యాంకులే అత్యధిక వడ్డీ అందిస్తుంటాయి. ఎఫ్‌డీలపై 9 శాతం వరకూ వడ్డీ అందిస్తున్న 5 బ్యాంకులేవో తెలుసుకుందాం.

ఫిక్స్డ్ డిపాజిట్లపై ఐదు చిన్న బ్యాంకులు అత్యదిక వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి. వీటిలో నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, యూనిటీ బ్యాంక్, సూర్యోదయ బ్యాంక్, ఉత్కర్ష్ వంటివి ఉన్నాయి. ఈ బ్యాంకులన్నీ ఏకంగా 9 శాతం వరకూ వడ్డీ అందిస్తున్నాయి. వీటిలో ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ దాదాపుగా దేశంలోని చాలా ప్రాంతాల్లో విస్తరించి ఉంది. ఈ బ్యాంక్ ఎఫ్‌డీలపై 8 శాతం వడ్డీ అందిస్తుంది. అదే 888 రోజుల ప్రత్యేక ఎఫ్‌డీ అయితే 8.25 శాతం వడ్డీ చెల్లిస్తోంది. 1 లక్ష రూపాయలు ఈ బ్యాంకులో ఎఫ్‌డి చేస్తే మెచ్యూరిటీ అనంతరం 1,17,742 రూపాయలు లభిస్తాయి. ఇది 888 రోజులకు లభించే మొత్తం. అంటే 17,742 రూపాయలు లాభం కలుగుతుంది. 

సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అయితే ఎఫ్ డీపై 8.6 శాతం వడ్డీ అందిస్తోంది. ఈ వడ్డీ 2-3 ఏళ్ల కాలవ్యవధి కలిగిన ఎఫ్‌డీలకు వర్తిస్తుంది. అదే రెండేళ్ల కాల వ్యవధికి 1 లక్ష రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ అనంతరం 1,18,551 రూపాయలు చేతికి అందుతాయి. అంటే 18,551 రూపాయలు లాభం ఉంటుంది. ఇదే మూడేళ్లకయితే 1,29,080 రూపాయలు లభిస్తాయి. 29 వేలు లాభం కలుగుతుంది. 

నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అయితే 546 రోజులు అంటే 18 నెలల ఎఫ్‌డీపై 9 శాతం వడ్డీ అందిస్తుంది. 3 ఏళ్ల వరకూ ఇదే వడ్డీ లభిస్తుంది. ఈబ్యాంకులో 1 లక్ష రూపాయలు ఎఫ్‌డీ చేస్తే రెండేళ్లకు అది 1,19,483 రూపాయలు అవుతుంది. మూడేళ్లకు ఎఫ్‌డి చేస్తే 1,30,605 రూపాయలు అందుతాయి. అంటే 30 వేలు లాభపడతారు. ఇక ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అయితే 2-3 ఏళ్ల ఎఫ్‌డీపై 8.50 శాతం వడ్డీ ఇస్తోంది. ఈ బ్యాంకులో రెండేళ్ల కాలవ్యవధికి 1 లక్ష రూపాయలు ఎఫ్‌డీ చేస్తే 1,18,320 రూపాయలు లభిస్తాయి. అంటే 18 వేలు లాభం ఉంటుంది. ఇక మూడేళ్లకు ఎఫ్‌డి చేస్తే 28 వేలు లాభం ఉంటుంది. 

ఇక ఐదవ బ్యాంక్ యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఈ బ్యాంక్ 2 ఏళ్ల 9 నెలలు అంటే 1001 రోజుల ఎఫ్‌డీపై 9 శాతం వడ్డీ అందిస్తోంది. ఈ బ్యాంకులో మీరు ఒక లక్ష రూపాయలు ఎఫ్‌డీ చేస్తే 1,30,605 రూపాయలు అందుకోవచ్చు. అంటే 30 వేల రూపాయలు లాభపడతారు. అయితే ఈ ఐదు బ్యాంకులు చిన్న బ్యాంకులు. రిస్క్ ఉండవచ్చు. ఉండకపోవచ్చు. ఈ వార్త కేవలం అవగాహన కోసం మాత్రమే. జీ న్యూస్ ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. 

Also read: 8th Pay Commission: ఉద్యోగులకు గుడ్‌న్యూస్, 8వ వేతన సంఘం ఏర్పాటు, పెన్షన్ 5 రెట్లు పెంపుపై ప్రకటన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News