Double Head Snake: హైదరాబాద్‌లో రెండు తలల పాము హల్‌చల్‌.. ఏం చేసిందంటే..?

Double Head Snake Creates Tension In Hyderabad: సాధారణంగా అందరూ ఒక తల పామును చూసి ఉంటారు. రెండు తలల పాము అనేది అత్యంత అరుదుగా కనిపిస్తుంటుంది. అలాంటి రెండు తలల పాము హైదరాబాద్‌లో ప్రత్యక్షమైంది. రెండు తలల పాము హల్‌చల్‌ చేసింది. వెంటనే పోలీసులు స్పందించి ఆ పామును స్వాధీనం చేసుకున్నారు.

1 /5

సాధారణంగా పామును ఒక తలతో చూసి ఉంటారు. అత్యంత అరుదుగా రెండు తలలతో పాములు కనిపిస్తుంటాయి.

2 /5

రెండు తలల పాము హైదరాబాద్‌లో హల్‌చల్‌ చేసింది. పామును తరలిస్తున్నారనే సమాచారం పాతబస్తీలో కలకలం రేపింది.

3 /5

పాతబస్తీ బహదూర్‌పుర ప్రాంతంలో రెండు తలల పామును కొందరు తరలిస్తున్నారనే సమాచారం తెలుసుకున్న స్థానికులు వారిని పట్టుకున్నారు.

4 /5

పట్టుకున్న రెండు తలల పామును బహదూర్‌పుర పోలీసులకు అప్పగించారు. పామును తరలించడం నేరంగా పోలీసులు పేర్కొన్నారు.

5 /5

పామును పరిశీలించి ఆ తర్వాత నెహ్రూ జూలాజికల్‌ పార్క్‌కు ఆ పామును బహదూర్‌పురా పోలీసులు అప్పగించారు.