Viral Video: అరె వావ్.. జిమ్‌లో తగ్గాఫార్ వర్కౌట్స్ చేస్తున్న ఊసర వెల్లులు.. వీడియో వైరల్..

chameleon doing pushups: జిమ్ లోకి రెండు ఊసర వెల్లులు ప్రవేశించాయి. అవి రెండు కూడా వర్కౌట్స్ చేస్తున్నాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.  దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం షాక్ అవుతున్నారంట.  

Written by - Inamdar Paresh | Last Updated : Jan 10, 2025, 01:04 PM IST
  • జిమ్ లో ఊసర వెల్లుల వర్కౌట్స్..
  • నవ్వుకుంటున్న నెటిజన్లు..
Viral Video: అరె వావ్.. జిమ్‌లో తగ్గాఫార్ వర్కౌట్స్ చేస్తున్న ఊసర వెల్లులు.. వీడియో వైరల్..

Chameleons in the gym video viral: సాధారణంగా సోషల్ మీడియాలో రోజుకు వందలాది వీడియోలు వైరల్ అవుతుంటాయి.  ఏదైన ఫన్నీగా ఉన్నా.. లేదా వెరైటీగా ఉన్న వీడియోలను నెటిజన్ లు తమ ఫోన్ లలో రికార్డులు చేసి వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తుంటారు. దీంతో అవి కాస్త వైరల్గా మారిపోతుంటాయి. నెటిజన్లు కూడా వీటిని చూసేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.

సోషల్ మీడియాలో ఇటీవల పెళ్లికి సంబంధించిన వెరైటీ వీడియోలు, పాముల వీడియోలు ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి. అదేవిధంగా జంతువులకు సంబంధించిన ఫన్నీ అంశం ఉన్న వీడియోలు సైతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటాయి. ఈ క్రమంలో ప్రస్తుతం రెండు ఊసర వెల్లులు జిమ్ లోకి ప్రవేశించాయి. అక్కడి వాళ్లను చూసి తామేందుకు జిమ్ చేయకూడదని  అనుకున్నాయో... ఏంటో కానీ.. జిమ్ లోకి వెళ్లి అక్కడ వర్కౌట్స్ చేయడం స్టార్ట్ చేశాయి.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by LADbible (@ladbible)

జిమ్ సెంటర్ లో.. పుష్ అప్స్ చేస్తు.. రచ్చ రచ్చ చేశాయి. అక్కడున్న వారు ఏవరో ఊసర వెల్లులు పుష్ అప్స్ చేస్తున్న ఘటనను తమ ఫోన్ లలో రికార్డు చేసి సోషల్ మీడియాలో పొస్ట్ చేశారు.దీంతో అది జెట్ స్పీడ్ లో వైరల్ గా మారిపోయింది. అయితే.. సాధారణంగా.. ఊసర వెల్లులు, తొండలు.. ఎక్కువగా అడవుల్లో ఎక్కువగా కన్పిస్తాయి. చెట్లు ఎక్కవగా ఉన్న ప్రదేశాలలో ఉంటాయి. అవి స్వాభావికంగా ముందుకు.. వెనక్కు కదులుతుంటాయి. 

Read more: Viral Video: ఉత్సవంలో షాకింగ్ ఘటన.. రెచ్చిపోయిన ఏనుగులు.. 17 మందికి సీరియస్..?.. వీడియో వైరల్..

ఈ క్రమంలో..ఇక్కడ కూడా.. ఊసర వెల్లులు ముందుకు వెనక్కు కదులుతున్నాయి. అయితే.. అది వెరైటీగా ఏదో జిమ్ లో పుష్ అప్ చేసే విధానంకు దగ్గరగా ఉండటంతో.. కొంత మంది ఊసర వెల్లులు పుష్ అప్ లు చేస్తున్నాయని ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఊసర వెల్లుల పుష్ అప్స్ వీడియో నెట్టింట సందడిగా మారిందని చెప్పుకొవచ్చు.
 

Trending News