హైదరాబాద్: కరోనా వైరస్ ను ఎలా ఎదుర్కోవాలో ప్రజల్లో అపోహలు, ఆందోళనలు వెంటాడుతూనే ఉన్నాయి. అయితే వెచ్చగా ఉండే వాతావరణంలో కరోనా వ్యాప్తి చెందదని, తేమ, శీతల వాతావరణంలో ఉంటే దీని బాగారి నుండి కాపాడుకోచ్చనే అపోహాలను నమ్మవద్దని వైద్యులు సూచిస్తున్నారు. చేతులను తరచుగా పరిశుభ్రంగా ఉంచుకోవడమే అత్యుత్తమమైన మార్గమని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచి స్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి ఏ వాతావరణంలోనైనా, ఎలాంటి పరిస్థితిలోనైనా సులువుగా వ్యాపించే అవకాశాలున్నాయని ఇప్పటివరకు చేస్తున్న శాస్త్ర పరిశోధనల ప్రకారం వాతావరణంతో సంబంధం లేకుండా వ్యాప్తు చెందొచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Read Also: మా కూతురు తిరిగిరాదు.. ఆమె ఆత్మ శాంతిస్తుంది: నిర్బయ తల్లి Asha Devi
చేతుల స్పర్శ వల్ల మీ కళ్లు, నోరు, ముక్కు భాగాలకు వైరస్ సంక్రమణ ద్వారా వేగంగా చెందే అవకాశాలున్నాయని, ఎప్పటికపుడు సబ్బుతో, వేడి నీళ్లతో తరచుగా కడుక్కోవడం వంటి జాగ్రత్తలు తప్పనిసరని వైద్యులు సూచిస్తున్నారు. అయితే మరోవైపు దోమకాటు వల్ల వ్యాప్తి చెందుతుందేమోనన్న అపోహలున్న నేపథ్యంలో దోమకాటు వల్ల కరోనా వ్యాప్తి చెందుతుందని ఇంతవరకు ఎలాంటి ఆధారాలు లేవని వైద్యులు చెబుతున్నారు.
కరోనాను వాడేస్తున్న పులిహోర రాజాలు..!
కరోనా వ్యాప్తి ముఖ్యంగా శ్వాస ద్వారా సంక్రమించే వ్యాధి, కాగా ఈ వైరస్ సంక్రమించిన వ్యక్తి దగ్గినా, గురక పెట్టినా, ముక్కు నుంచి ద్రవం, నోటి నుంచి లాలాజలం వచ్చినా వాటి నుంచి వెలువడే తుంపర్ల వల్లనే ఈ వైరస్ సంక్రమిస్తుందని అలాంటి వ్యక్తుల దగ్గు, తుమ్ము గురక నుంచి దూరంగా ఉంటూ, చేతులు తరచుగా పరిశుభ్రంగా ఉంచుకొవాలని సూచిస్తున్నారు.
Also Read: ఒక్క రూపాయి కూడా చెల్లించవద్దు: కిషన్ రెడ్డి
The total number of positive cases of #COVID19 in India now stands at 195 (including 32 foreigners), 4 deaths (1 each) in Delhi, Karnataka, Punjab and Maharashtra: Ministry of Health and Family Welfare pic.twitter.com/0WENTqUXlr
— ANI (@ANI) March 20, 2020
కాగా భారతదేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 195కు చేరింది. ఇందులో 32 మంది విదేశీయులున్నారు. ఇప్పటివరకు కరోనా మహమ్మారి బారి నుండి 4 మరణించారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారికంగా వెల్లడించింది. అయితే కరోనా బాధితుల సంఖ్య అత్యధికంగా మహారాష్ట్రలో 47 కేసులు నమోదవ్వగా, కేరళలో 28 కేసులు నమోదయ్యాయని తెలిపింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..