'కరోనా వైరస్'ను సమర్ధంగా ఎదుర్కునేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్ డౌన్ విధించారు. లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు. ఈ క్రమంలో మరో ముందడుగు వేసింది కేంద్ర ప్రభుత్వం.
'కరోనా'ను ఎదుర్కునేందుకు రూ. 2 కోట్ల సాయం
'కరోనా వైరస్'పై సరైన సమాచారం కోసం కేంద్ర ప్రభుత్వం వాట్సప్ నంబర్ విడుదల చేసింది. ఈ నంబరును స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. 'కరోనా వైరస్'పై సరైన సమాచారం కోసం 9013151515 అనే వాట్సప్ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చని చెప్పారు. మహాభారత యుద్ధాన్ని గెలిచేందుకు 18 రోజులు పట్టిందని.. 'కరోనా వైరస్'పై యుద్ధాన్ని గెలిచేందుకు మాత్రం 21 రోజులు పడుతుందని ప్రధాని మోదీ అన్నారు. అందుకే దేశవ్యాప్తంగా 21 రోజులపాటు లాక్ డౌన్ విధించామని తెలిపారు. 'కరోనా వైరస్'పై భయపడవద్దని మోదీ చెప్పారు. ఇప్పటి వరకు పాజిటివ్ గా ఉన్న లక్ష మంది రోగులు కోలుకుంటున్నారని వివరించారు. ఐతే 'కరోనా వైరస్'పై అందరికీ అవగాహన అవసరమని స్పష్టం చేశారు.
महाभारत का युद्ध 18 दिन में जीता गया था। आज कोरोना के खिलाफ जो युद्ध पूरा देश लड़ रहा है, हमारा प्रयास है कि इसे 21 दिन में जीत लिया जाए।
महाभारत के युद्ध के समय भगवान कृष्ण महारथी थे, सारथी थे। आज 130 करोड़ महारथियों के बलबूते हमें कोरोना के खिलाफ इस लड़ाई को जीतना है। pic.twitter.com/pA7rE6Zub3
— Narendra Modi (@narendramodi) March 25, 2020
'కరోనా వైరస్' నిర్మూలించేందుకు 24 గంటల సేవలు చేస్తున్న వైద్యులపట్ల అందరూ గౌరవభావంతో ఉండాలని ప్రధాని మోదీ అన్నారు. వారిపై కొంత మంది దురుసుగా ప్రవర్తించడాన్ని ఆయన ఖండించారు. వైద్యులు దేవునితో సమానమని గుర్తించాలని కోరారు. 'కరోనా వైరస్'కు ధనిక, పేద, ఆడ, మగ, పిల్లలు, వృద్ధులు ఏం తేడా ఉండని మరోసారి గుర్తు చేశారు. కాబట్టి .. అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. నిత్యావసర వస్తువుల కోసం బయటకు వెళ్లేవారు కచ్చితంగా సామాజిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. కష్టాలు ఉన్నా 'కరోనా వైరస్'ను నిర్మూలించేందుకు తప్పదని తెలిపారు. సమష్టిగా పోరాడి 'కరోనా వైరస్'పై విజయం సాధించాలని అందరూ గుర్తు పెట్టుకోవాలని కోరారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..