నేటి నుంచి హైదరాబాద్ లో ప్రపంచ పారిశ్రామిక సదస్సు

హైదరాబాద్ ఇంటర్నేషనల్ కాన్షరెన్స్ సెంటర్ (హెచ్ఐసీసీ ) వేదికగా ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు ప్రారంభకానుంది. ఈ సదస్సును ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ఈ సదస్సులో ఇవాంక ట్రంప్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు

Last Updated : Nov 28, 2017, 10:02 AM IST
నేటి నుంచి హైదరాబాద్ లో ప్రపంచ పారిశ్రామిక సదస్సు

హైదరాబాద్: రేపటి నుంచి  హైదరాబాద్ లో ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు ప్రారంభకానుంది. ప్రధాని చేతుల మీదుగా ప్రారంభమయ్యే ఈ సమ్మిట్ మూడు రోజుల పాటు జరగనుంది. మహిళా పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సహించడమే ఈ సదస్సు లక్ష్యం. ఇదే ప్రధానాంశంగా ఈ సదస్సు జరగనుంది. ఈ మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో 175 మంది ప్రతినిధులు 53 సెకన్లు చొప్పున ప్రసంగించనున్నారు. దీనికి హైదరాబాద్ ఇంటర్నేషనల్ కాన్షరెన్స్ సెంటర్ (హెచ్ఐసీసీ )  వేదిక కానుంది. కాగా ఈ సమ్మిట్ లో ఇవాంక ట్రంప్ తో సహా 1500 మంది పారిశ్రామిక వేత్తలు హాజరౌతున్నారు. ఇవాంక ట్రంప్ అమెరికా ప్రభుత్వ సలహాదారు హోదాలో ఆమె సదస్సుకు హాజరౌతున్నారు. ఈ సదస్సును అమెరికా ప్రభుత్వంతో కలిసి నీతి ఆయెగ్ నిర్వహిస్తోంది. కాగా దక్షిణాసియాలో ప్రపంచ పారిశ్రామిక వేత్తల సమావేశం జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం.

Trending News