మహిళలు సత్తా చాటేందుకు జీఈఎస్ సరైన వేదిక

మహిళల ప్రగతి విషయంలో తనకు క్లియర్ విజన్ ఉందని.. తన విజన్ గురించి సదస్సులో వెల్లడిస్తానని ఇవాంక ట్రంప్ పేర్కొన్నారు. 

Last Updated : Nov 28, 2017, 06:25 PM IST
మహిళలు సత్తా చాటేందుకు జీఈఎస్ సరైన వేదిక

హైదరాబాద్: మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తే  ప్రగతి సాధించడం మరింత సులువవుతుందని ఇవాంక ట్రంప్ వెల్లడించారు. ప్రపంచ పారిశ్రమవేత్తల సదస్సు (జీఈఎస్)లో పాల్గొనేందుకు హైదరాబాద్ చేరుకున్న ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల పురోగతే తన జీవిత లక్ష్యమని వెల్లడించారు. మహిళల ప్రగతి విషయంలో తనకు క్లియర్ విజన్ ఉందని.. తన విజన్ గురించి సదస్సులో వెల్లడిస్తానని పేర్కొన్నారు. మహిళలను పారిశ్రామిక రంగంలో  ప్రొత్సహించడమే ప్రధాన లక్ష్యంగా సాగుతున్న ప్రపంచ పారిశ్రామిక వేత్తల సమావేశంలో ఇవాంక ప్రపంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మహిళా ప్రగతి కోసం ట్రంప్, మోడీ ఎంతో కృషి చేస్తున్నారు..

అమెరికా అధ్యక్షుడు ట్రంప్, నరేంద్ర మోడీ మహిళల ప్రగతి కోసం ఎంతో కృషి చేస్తున్నారని ఇవాంక వెల్లడించారు. జీఈఎస్ లో 50 శాతం మంది మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పాల్గొంటున్నారని గుర్తు చేసిన ఇవాంక ...వారి సత్తా చాటేందుకు ఇది సరైన అంతర్జాతీయ వేదికని వెల్లడించారు. 

Trending News