చంద్రబాబుకు సీఎం జగన్ బర్త్ డే విషెస్.. ఈసారి ప్రత్యేకం!

చంద్రబాబునాయుడు పుట్టినరోజు నేడు. చంద్రబాబుకు రాజకీయ, సినీ, వ్యాపార రంగాల ప్రముఖులు, సెలబ్రిటీలు బర్త్ డే విషెస్ (Happy Birthday Chandrababu) తెలుపుతున్నారు. 

Last Updated : Apr 20, 2020, 01:42 PM IST
చంద్రబాబుకు సీఎం జగన్ బర్త్ డే విషెస్.. ఈసారి ప్రత్యేకం!

ఆంధప్రదేశ్‌ ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు నేడు (ఏప్రిల్ 20). చంద్రబాబుకు రాజకీయ, సినీ, వ్యాపార రంగాల ప్రముఖులు, సెలబ్రిటీలు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఈ సందర్బంగా ప్రతిపక్షనేత చంద్రబాబు పుట్టినరోజును పురస్కరించుకుని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబుకు దేవుడు సంతోషాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ ట్విటర్‌లో ఓ పోస్ట్‌ చేశారు.  Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!

పుట్టినరోజులు సందర్భంగా నేతలు పరస్పరం ఒకరినొకరు విషెస్ తెలుపుకుంటున్నారు. అయితే ఈ ఏడాది పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది. గత ఐదేళ్లు ప్రతిపక్షనేతగా ఉన్న వైఎస్ జగన్‌కు సీఎంగా ఉన్న చంద్రబాబు, సీఎంగా ఉన్న చంద్రబాబు, ప్రతిపక్షనేత జగన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేవారు. అయితే వైఎస్ జగన్ ఈ ఏడాది తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబుకు బర్త్ డే విషెస్ తెలపడం ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర అంశంగా మారింది.  ఏపీలో దారుణం: లాఠీ దెబ్బలకు యువకుడి మృతి!  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

 ‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos 

Trending News