నవ్యాంధ్ర రాజధాని సమీపంలో త్వరలో హెచ్సీఎల్ కంపెనీ రాబోతున్నది. ఈమేరకు హెచ్సీఎల్(HCL) సంస్థ వ్యవస్థాపకుడు శివనాడార్ మంగవారం ఏపీ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. తాము హెచ్సీఎల్ ఐటీ సెజ్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని.. విజయవాడ, నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో నిర్మించతలపెట్టిన ఐటీ సెజ్ కు అనుమతులన్నీ ఇవ్వాలని కోరారు. తమ ప్రమాణాలను పరిశీలించడానికి చెన్నైలోని హెచ్సీఎల్ కార్యాలయాన్ని ఓసారి సందర్శించాలని కోరగా.. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.
అనుమతులన్నీ త్వరగా లభిస్తే.. జనవరిలో హెచ్సీఎల్ ఐటీ సెజ్ కు శంకుస్థాపన చేయనున్నారు. రూ.750 కోట్ల పెట్టుబడితో నిర్మించనున్న ఐటీ సెజ్ కు గన్నవరం ఎయిర్ పోర్ట్ సమీపంలో 28 ఎకరాలు కేటాయించనుంది ప్రభుత్వం. జనవరిలో భూమిపూజ చేసి మర్చి 2019లోగా ఐటీ భవనాలను పూర్తిచేయనున్నారు. నవ్యాంధ్రకు హెచ్సీఎల్ ఐటీ సెజ్ రావడం వల్ల 12,500 మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి.
Tech. tycoon Sri. Shiv Nadar, the founder and chairman of @hcltech, visited the Real Time Governance State Centre today and witnessed the salient features like real-time data analytics and matrix surveillance system which is being processed for public safety & better governance. pic.twitter.com/OKdlnVw3eq
— Andhra Pradesh CM (@AndhraPradeshCM) November 28, 2017