యంగ్ హీరో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘లవ్ స్టోరీ’. ఫిదా మూవీ తర్వాత శేఖర్ కమ్ముల చేస్తున్న ప్రాజెక్టు ఇది. ఆ సినిమాతో అందర్నీ తన నటనతో ఫిదా చేసిన సాయిపల్లవి మరోసారి ఆ దర్శకుడితో కలిసి పనిచేస్తోంది. అయితే ఎప్పుడూ వదంతులు, వివాదాలకు దూరంగా ఉండే చైతూ సినిమాకు సంబంధించి తాజాగా కొన్ని విషయాలు వైరల్ అవుతున్నాయి. లాక్డౌన్లో మిల్కీ ‘బ్యూటీ’ Photos
ఒకటి చైతూను సాయిపల్లవి డామినేట్ చేసిందని, క్లైమాక్స్‌లో ఆమెకు అధిక ప్రాధాన్యం ఇచ్చారంటూ ప్రచారం జరుగుతోంది. రెండో విషయం ఏంటంటే.. క్లైమాక్స్ స్టోరీపై చైతూ కాస్త ఫీలయ్యాడని, అతడి ‘లవ్ స్టోరీ’ సినిమాలో సమంత జోక్యం చేసుకున్నారని హాట్ టాపిక్ అయింది. ఈ విషయాలపై మూవీ యూనిట్ క్లారిటీ ఇచ్చింది. వదంతులకు చెక్ పెట్టింది. సినిమాలో చైతూ, సాయి పల్లవి ఇద్దరి పాత్రలకు సమ ప్రాధాన్యం ఉందని, ప్రచారం అవుతున్న వదంతుల్లో నిజం లేదని మూవీ యూనిట్ స్పష్టం చేసింది. బికినీలో బ్యూటీలు.. సమ్మర్ మరింత హాట్!
ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా లవ్ స్టోరీ షూటింగ్ వాయిందా పడిందన్నారు. ఈ సినిమాకు సంబంధించి సమంత ఎలాంటి జోక్యం చేసుకోలేదట. చైతూ సినిమాలు అతడికి బాగానే తెలుసునని, తాను జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని సమంత స్పందించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ రెండు వదంతులకు ఒకేసారి చెక్ పెట్టినట్లయింది. అసలే లాక్ డౌన్ టైమ్ కావడంతో లేనిపోని కొత్త వదంతులు పుట్టుకొస్తున్నాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
Photos: కేఎల్ రాహుల్, అతియా శెట్టి క్రేజీగా!