రామప్ప ఆలయాన్ని పరిరక్షించండి

కాకతీయుల చరిత్రకు ఆనవాళ్ళు మిగిల్చిన రామప్ప ఆలయ పరిరక్షణకు నడుం బిగించాలని కేంద్ర పురావస్తు శాఖతో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఆంధ్ర, తెలంగాణల ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది.

Last Updated : Nov 30, 2017, 05:56 PM IST
రామప్ప ఆలయాన్ని పరిరక్షించండి

కాకతీయుల చరిత్రకు ఆనవాళ్ళు మిగిల్చిన రామప్ప ఆలయ పరిరక్షణకు నడుం బిగించాలని కేంద్ర పురావస్తు శాఖతో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఆంధ్ర, తెలంగాణల ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది.  ప్రతిష్టాత్మక రామప్ప ఆలయ ప్రహరీగోడలు ఇటీవలే కూలిపోవడంతో పాటు ఆలయాన్ని నిర్వహిస్తున్న విషయంలో అధికారుల నిర్లక్ష్యం మొదలైన విషయాలపై వివిధ పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా కోర్టులో దాఖలైన పిల్ స్వీకరించిన కోర్టు కేసును సుమోటోగా స్వీకరించి తన తుది తీర్పు వెలువరించింది.

ఇప్పటికే ఈ ఆలయ పరిరక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలో అన్న అంశంపై పూర్తి ప్లానింగ్‌తో కూడిన నివేదికను వరంగల్ నిట్ ప్రొఫెసర్లు పురావస్తు శాఖకు అందించారు. అయితే కౌంటర్ పిటీషన్ దాఖలు చేయడానికి కొంచెం సమయంకావాలని కేంద్ర ప్రభుత్వ సొలిసిటర్ కె.లక్ష్మణ్ హైకోర్టుకి తెలిపారు. 

రామప్ప దేవాలయాన్ని క్రీస్తు శకం 1213లో గణపతి దేవుని కాలానికి చెందిన రేచర్ల రుద్రుడు కట్టించారని ప్రతీతి. మధ్యయుగానికి చెందిన ఈ శివాలయంలో ఉన్న మూర్తి పేరు మీదుగా కాక దీనిని చెక్కిన శిల్పి రామప్ప పేరు మీదుగా ఈ ఆలయ నామం స్థిరపడడం విశేషం. ఈ ఆలయానికి ఆ ముక్కంటి పేరు కూడా కలిపి రామలింగేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు. విష్ణువు అవతారమైన రాముడు మరియు పరమ శివుడు కలిసి ప్రధాన దైవాలుగా ఉన్న భారతదేశంలోని ఏకైక ఆలయం రామప్ప ఆలయమే.  

Trending News