సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ( Sushant Singh Rajput ) ఆత్మహత్య తరువాత బాలీవుడ్లో బంధు పక్షపాతం ( Nepotism )పై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. అందులో భాగంగానే సుశాంత్ సినిమాను అర్జున్ లాగేసుకున్నాడు అంటూ నెటిజెన్స్ ట్రోల్ చేస్తున్నారు. చేతన్ భగత్ రాసిన హాఫ్ గాళ్‌ఫ్రెండ్ ( Half Girlfriend ) నవల కథ ఆధారంగా 2015లో ఒక సినిమాను తెరకెక్కిద్దాం అనుకున్నారు. మోహిత్ సూరి దర్శకత్వం వహించే ఈ మూవీలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను హీరోగా ఫైనల్ చేశారు. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ చివరికి అర్జున్ కపూర్ ( Arjun Kapoor ) హీరోగా నిర్ణయించారు. అయితే ఇటీవలే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తరువాత సినీ పరిశ్రమలో బంధు పక్షపాతంపై తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సుశాంత్‌కు ఓకే అయిన సినిమాలు ఇతర హీరోలకు ఎలా వెళ్లాయో అనే విషయంపై నెటిజెన్లు ( Netigens ) చర్చించుకుంటున్నారు.
Not just once, you can check the how many time #SushantSinghRajput role was taken by others.
#ArjunKapoor #ConsiderSSRMurderProofs#justiceforSushantforum pic.twitter.com/jLuFFA2EBC— Kangana Ranaut (@kanganaranaut_O) June 24, 2020
అర్జున్ కపూర్ స్టార్ కిడ్ ( Star Kid ) అవడం వల్లే అతనికి ఈ సినిమా అవకాశం వచ్చింది అని... లేదంటే సుశాంత్ నటనకు అర్జున్ నటనకు మధ్య పోలికే ఉండదు అని దుమ్మెత్తి పోస్తున్నారు. అదే సమయంలో అర్జున్ కపూర్ యాక్టింగ్ సామర్థ్యంపై వ్యంగ్యంగా ట్వీట్లు చేస్తున్నారు.
అందులో కొన్నిమీరు కూడా చూడండి.
A struggling actor proves his
acting skills to become a top actor.Star-kid just lose weight.
Eg: pic.twitter.com/McIFNziL17— चंचल प्रजापति 💌💯💁 (@Chancha99190184) June 24, 2020
Acting gone🤣 #ArjunKapoor pic.twitter.com/GeDLpAX4A1
— Pranjul Sharma 🌸 (@pranjultweet) June 24, 2020
Effort and struggle done by #ArjunKapoor pic.twitter.com/s1ER10fPp2
— NV⚡😎 (@menve_s) June 24, 2020
అయితే కొంత మంది మాత్రం రాబ్తా సినిమా కోసం సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హాఫ్ గాళ్ ఫ్రెండ్ సినిమాను కాదన్నాడని కూడా చెబుతున్నారు. ఇందులో ఏది నిజం అనేదే ఆ సినిమా మేకర్సే చెప్పాలి.