ముంబై: అవయవాలను దానం చేయాలని ప్రముఖ బాలీవుడ్ కపుల్ రితేష్ దేశ్ ముఖ్, జెనీలియా నిర్ణయం తీసుకున్నారు. డాక్టర్స్ డేను పురస్కరించుకుని వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. మరణానంతరం తమ అవయవాలను దానం చేయాలని నిర్ణయించుకున్నట్టు జెనీలియా సోషల్ మీడియా వేదికగా తెలిపారు. అవయవాల దానంపై తాము ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నామని, అయితే డాక్టర్స్ డే సందర్భంగా తమ అవయవాలను దానం చేయాలని నిర్ణయించుకున్నామని జెనీలియా వెల్లడించారు. ప్రజలు కూడా అవయవాలను దానం చేయాలని ఆమె పిలుపు నిచ్చారు. అవయవదానంపై ప్రజల్లో చైతన్యం రావాలని ఆమె అభిప్రాయపడ్డారు. అవతార్ ఫీచర్ ను లాంచ్ చేసిన facebook..
There is no greater gift to someone than ‘The Gift Of Life’. @genelia & me have pledged to donate our organs. We urge you all to join this great cause and be part of ‘The Life AfterLife’. pic.twitter.com/dq4flMSxT6
— Riteish Deshmukh (@Riteishd) July 1, 2020
Also Read: Madhya Pradesh cabinet: మధ్యప్రదేశ్ కొత్త కేబినెట్‌లో జ్యోతిరాదిత్య సిందియా మార్క్
గతంలో పలువురు బాలీవుడ్ ప్రముఖులు అవయవ దానానికి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. ఐ బ్యాంక్ అసోసియేషన్‌కు కళ్ళు దానం చేస్తానని బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ ప్రతిజ్ఞ చేశారు. సల్మాన్ ఖాన్ ఒక అమ్మాయి ప్రాణాలను కాపాడటానికి గతంలో తన ఎముక మజ్జను దానం చేయగా, ఆర్ మాధవన్ తన కళ్ళు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలను దానం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు.
Also Read: ఇంటికి పిలిచి తోబుట్టువులనే కడతేర్చిన ఉన్మాది
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
బికినీలో బిగ్‌బాస్ రన్నరప్.. వామ్మో అంత హాట్‌గా!
జెనీలియా దంపతుల సంచలన నిర్ణయం..