హెడ్సెట్ లేకుండానే వీఆర్ (VR) ను తలదన్నే క్వాలిటీతో సర్వం వీక్షించవచ్చిక. ఆశ్చర్యంగా ఉందా. నిజమే..వన్‌ప్లస్ (One plus) సరికొత్త ఆవిష్కరణ ఇది. త్వరలో మార్కెట్ లో రానున్న వన్ ప్లస్ కొత్త ఫోన్ లో ప్రపంచంలోనే తొలిసారి ఏఆర్ టెక్నాలజీ (AR Technology) వినియోగిస్తున్నారు. ఆ ఫీచర్స్ ఏంటో తెలుసుకుందామా..
స్మార్ట్ ఫోన్స్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది వన్‌ప్లస్ (One plus). ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతుంటుంది. ఇప్పుడు మరో సరికొత్త ఫీచర్‌ను ప్రపంచంలోనే తొలిసారిగా ప్రవేశపెడుతూ...కొత్త మోడల్ ఫోన్ ను మార్కెట్ లో తీసుకురానుంది. ఈ కొత్త మోడల్ పేరు వన్‌ప్లస్ నార్డ్. ప్రపంచంలోనే తొలిసారిగా ఏఆర్ టెక్నాలజీ అంటే ఆగ్మెంటెడ్ పరిజ్ఞానాన్ని (Augmented Reality) వాడుతున్నారు. జూలై 21న భారత్, యూరోప్ మార్కెట్ లో ప్రవేశపెడుతున్నారు ఈ మోడల్‌ను. 2015లో వర్చ్యువల్ రియాలిటీ వీఆర్ టెక్నాలజీతో (Virtual Technology VR) వన్‌ప్లస్ 2 ( One plus 2) ను ప్రవేశపెట్టింది. ఇప్పుడు వీఆర్ కు అడ్వాన్స్ మోడల్‌గా ఆధునికమైన ఆగ్మెంటెడ్ ఏఆర్ రియాలిటీతో వన్‌ప్లస్ నార్డ్ మోడల్ (One plus nord) ప్రవేశపెడుతోంది. వీఆర్‌లో వీక్షించాలంటే హెడ్ సెట్ తప్పనిసరి. కానీ ఏఆర్ లో ఆ అవసరం లేదు. అయితే దీనికోసం వన్‌ప్లస్ నార్డ్ ఏఆర్ యాప్‌ను ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకుని పర్మిషన్ తీసుకోవల్సి ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 765G ప్రోసెసర్2తో వస్తోంది. మిగిలిన ఇతర ఫీచర్ల గురించి ఇంకా తెలియాల్సి ఉంది. Also read: Apps banned in China: గూగుల్, ఫేస్బుక్, ట్విటర్, యూట్యూబ్, వాట్సాప్ సహా చైనాలో ఇవన్నీ నిషేధమే
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..